Thudarum Movie : కేవలం నెల రోజుల గ్యాప్ లో మోహన్ లాల్(Mohan lal) ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని తన మళయాలం ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసాడు. నెల రోజుల క్రితమే ఆయన హీరో గా నటించిన ‘L2: ఎంపురాన్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో నడుస్తూ ఉండగానే, ఆయన నుండి ‘తుడరం'(Thudarum Movie) అనే చిత్రం విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు చల్లబడడం సర్వసాధారణం, కానీ ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా శివతాండవం ఆడేస్తుంది. 5 రోజుల్లో దాదాపుగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ కి దగ్గరగా రాబట్టిన ఈ చిత్రం, ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో చూద్దాం.
Also Read: గుడ్ బ్యాడ్ అగ్లీ’ 20 రోజుల వసూళ్లు..ఇక ముగిసినట్టే..టార్గెట్ మిస్!
ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా తెలుగు వెర్షన్ మొదటి రోజు విడుదల కాలేదు. రెండవ రోజు నుండి విడుదలైంది. విడుదలైన రోజు నుండి స్టడీ కలెక్షన్స్ ని రాబడుతూ ముందుకు దూసుకెళ్తున్న ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుండి కోటి 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ వసూళ్లు 85 లక్షలు వచ్చాయి. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ తెలుగు వెర్షన్ కి 2 కోట్ల 50 లక్షలకు జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో కోటి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక 5 వ రోజున ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
కేరళ ప్రాంతంలో 5 రోజులకు 33 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఓవర్సీస్ లో 53 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. వర్కింగ్ డేస్ లోనే ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబడుతుంటే, ఇక వీకెండ్ లో ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో మీరే ఊహించుకోండి. అదే విధంగా కర్ణాటక రాష్ట్రంలో 4 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తమిళనాడు + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 4 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. ఓవరాల్ గా 5 రోజుల్లో 97 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక షేర్ వసూళ్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు 47 కోట్ల రూపాయిలు వచ్చాయట. 46 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, అప్పుడే కోటి రూపాయిల లాభాల్లోకి వచ్చింది ఈ చిత్రం.