సంక్రాంతి రేసులో ముగ్గురు స్టార్ హీరోలు

ఈ సంక్రాంతి కోడిపందేలతోపాటు మూవీల పండుగను కూడా తీసుకురాబోతోంది. ముగ్గురు స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో కోడిపుంజెల్లో తలపడబోతున్నారు. ఎవరు గెలుస్తారు? బాక్సాఫీస్ బరిలో ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తిగా మారింది. సంక్రాంతిని ఖచ్చితంగా ముగ్గురు నలుగురు స్టార్ హీరోలు తలపడడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగువారికి పెద్ద పండుగ అయిన ఈ టైంలో సినిమాలు చూసేందుకు జనాలు ఎగబడుతారు. థియేటర్లలో జనాలతోపాటు సినిమాల జాతీర ఇప్పుడే అధికంగా ఉంటుంది. భారీ వసూళ్లు, రికార్డులు సంక్రాంతికే నమోదవుతాయి. ఈ […]

Written By: NARESH, Updated On : July 30, 2021 6:02 pm
Follow us on

ఈ సంక్రాంతి కోడిపందేలతోపాటు మూవీల పండుగను కూడా తీసుకురాబోతోంది. ముగ్గురు స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో కోడిపుంజెల్లో తలపడబోతున్నారు. ఎవరు గెలుస్తారు? బాక్సాఫీస్ బరిలో ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తిగా మారింది.

సంక్రాంతిని ఖచ్చితంగా ముగ్గురు నలుగురు స్టార్ హీరోలు తలపడడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగువారికి పెద్ద పండుగ అయిన ఈ టైంలో సినిమాలు చూసేందుకు జనాలు ఎగబడుతారు. థియేటర్లలో జనాలతోపాటు సినిమాల జాతీర ఇప్పుడే అధికంగా ఉంటుంది. భారీ వసూళ్లు, రికార్డులు సంక్రాంతికే నమోదవుతాయి.

ఈ క్రమంలోనే ఈసారి ముగ్గురు స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఈ మేరకు వచ్చే ఏడాది పండుగకు తమ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

అందరికంటే ముందే సంక్రాంతికి తన సినిమా విడుదలను ప్రకటించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం తీస్తున్న ‘సర్కారివారి పాట’ను సంక్రాంతి రేసులోపెట్టాడు. పరుశురాం దర్శకత్వంలో తీస్తున్న ఈ మూవీని సంక్రాంతికే విడుదల చేయనున్నట్టు తెలిపారు.

ఇక పవన్ కూడా తాజాగా సంక్రాంతి బరిలో దిగేశాడు. త్రివిక్రమ్ పర్యవేక్షణలో సాగర్ చంద్ర దర్శకత్వంలో తీస్తున్న మల్టీ స్టారర్ ‘పవన్-రానా’ మూవీని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. దీంతో మహేష్ తో పోటీపడడానికి పవన్ రెడీ అయినట్టు తెలుస్తోంది.

ఇక బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ తన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’ను సంక్రాంతి అయిన జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించాడు. వింటేజ్ లవ్ స్టోరీకి చాలా సమయం ఉన్నా థర్డ్ వేవ్ దృష్ట్యా ఈ సినిమాను చాలా లాంగ్ గ్యాప్ తో విడుదలకు తేదీ ఖరారు చేశారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి రేస్ లో నిలిపారు.

కాగా ముగ్గురు స్టార్ హీరోలు సంక్రాంతికి పోటీపడుతుండడంతో అచంనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు? ఎవరి సినిమా ఆడుతుందనేది ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.