Tollywood: కొంతమంది ఇండస్ట్రీ లో ఏదోఒకటి చేసి సక్సెస్ అవ్వాలనే ఉద్దేశ్యం తో ఇండస్ట్రీ కి వస్తు ఉంటారు నిజానికి ఈ సినిమా ఇండస్ట్రీ లో ఒకటి అవ్వాలనుకొని వచ్చి ఇంకోటి అయిన వారు చాలా మంది ఉన్నారు అంటే కొంతమంది రైటర్లు అవ్వాలనుకొని వస్తారు కానీ వాళ్ళు కమెడియన్ గా మరిపోతారు.మరికొందరు మాత్రం హీరో అవ్వాలని వచ్చి డైరెక్టర్లు అవుతూ ఉంటారు ఇంకా కొందరు అయితే డైరెక్టర్ అవ్వాలని వచ్చి హీరో లు గా ఇండస్ట్రీ లో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు.అలాంటి వాళ్ళు ఇండస్ట్రీ లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
మొదటగా నాని లాంటి యంగ్ హీరో ఇండస్ట్రీ లోకి డైరెక్టర్ అవుదామని వచ్చి సీనియర్ డైరెక్టర్ అయిన బాపు గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మెళుకువలు నేర్చుకొని ఆ తర్వాత శ్రీను వైట్ల దగ్గర కూడా చాలా రోజుల పాటు పని చేసారు ఇక డైరెక్టర్ అవ్వాల్సిన టైం లో ఇంద్రగంటి మోహన కృష్ణ తీసిన అష్ట చమ్మ సినిమాతో ఇండస్ట్రీ లో మంచి హీరో గా గుర్తింపు పొందాడు.ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఒక స్టార్ హీరో గా కూడా గుర్తింపు పొందుతున్నాడు…ఇక రైటర్ గా వచ్చి ఇండస్ట్రీ లో కమెడియన్ గా కామెడీ చేసిన నటులలో ఎమ్మెస్ నారాయణా ఒకరు ఈయన మొదట రైటర్ గా ఇండస్ట్రీ కి వచ్చి ఆ తర్వాత ఇవివి సత్యనారాయణ తీసిన మానాన్న కి పెళ్లి అనే సినిమాతో నటుడిగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిజానికి ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. బ్రహ్మనందం తరువాత ఆ స్థాయి లో కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు.అయితే ఆయన 2014 సంవత్సరం లో మనల్ని అందరిని విడిచి స్వర్గస్తులైనారు…ఇక వీళ్లే కాకుండా ఇండస్ట్రీ లో ఇలా ఒకటి అవుదామని వచ్చి ఇంకొకటి అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు…