Devara: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన చేసిన గత చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. వరుసగా ఆరు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఈతరం స్టార్ హీరోల్లో ఒకడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న దేవర సినిమా మీదనే ఆయన భారీ అంచనాలను పెట్టుకున్నాడు.
ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని పాన్ ఇండియా లెవెల్ లో మరొకసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా పైన కొంతమంది ఇప్పటికే నెగిటివ్ ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొరటాల శివ ఇంతకుముందు చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా డిజాస్టర్ గా మిగలడంతో ఇప్పుడు ఎన్టీఆర్ కి కూడా కొరటాల మరో డిజాస్టర్ ఇవ్వబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో తనదైన రీతిలో చర్చలు అయితే జరుగుతున్నాయి.నిజానికి ఎన్టీఆర్ స్టార్ హీరో అయినప్పటికీ కొరటాల శివ కూడా స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు.
అయితే తనకి ఒక సినిమా డిజాస్టర్ అవడంతో తన టాలెంట్ మొత్తం అయిపోయింది అని అందరూ అనుకుంటున్నారు కానీ అందరి ఊహలని తలకిందులు చేసే విధంగా ఆయన దేవర సినిమాని చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ కొంతమంది మాత్రం పనిగట్టుకొని ఈ సినిమా మీద నెగిటివ్ ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావడం లేద.సోషల్ మీడియాలో దేవర సినిమా హిట్టు ప్లాప్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఆ సినిమా మీద బ్యాడ్ కామెంట్స్ ని చేస్తున్నారు.ఇలా చేయడం వల్ల వాళ్లకు వచ్చేది ఏమీ లేదు కానీ ఒక సినిమా అనేది అన్ని కోట్ల బడ్జెట్లను పెట్టుకొని తీయడం వల్ల ఆ సినిమాకు భారీగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఒక సినిమా రాకముందే దానిమీద నెగిటివ్ ప్రచారం చేయడం అనేది చాలా వరకు తప్పు…
ఎందుకంటే ఆ సినిమాని నమ్ముకొని చాలామంది జీవనం సాగిస్తూ ఉంటారు. ఇక రిలీజ్ కి ముందు ఆ సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేస్తే ప్రేక్షకుల్లో ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే వాళ్లకు నెగిటివ్ అభిప్రాయం పడుతుంది. కాబట్టి సినిమా మీద అలాంటి ప్రభావాన్ని తొలగించుకోవాలంటే చాలా కష్టం. ఒకవేళ సినిమా బాగున్నప్పటికీ ఆ సినిమా చూసే అభిమానికి ఆ నెగిటివ్ ఇంప్రెషన్ అనేది మైండ్ లో ఉంది కాబట్టి సినిమా కూడా బాగాలేదని అనిపిస్తుంది. అందువల్ల ఇప్పటినుంచి సినిమా మీద అలా నెగటివ్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అంటూ మన సినీ మేధావులు సైతం అలాంటి ప్రచారం చేసేవారిని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు…