OTT Movies: ఓటీటీలో ‘యానిమల్’ తర్వాత ట్రెండ్ అవుతోన్న తప్పక చూడాల్సిన ఆ రెండు సినిమాలివీ..

ఇప్పుడు యానిమల్ సినిమా ఓటీటీలో విడుదలై అక్కడ కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ ను సంపాదింస్తుంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదలైన ఈ సినిమా సంచలనమే సృష్టిస్తుంది.

Written By: Swathi, Updated On : February 8, 2024 9:29 am

OTT Movies

Follow us on

OTT Movies: ఒకప్పుడు థియేటర్లలో మాత్రమే సినిమాలు వచ్చేవి. ఆ సినిమాలు మళ్లీ టీవీలో రావాలంటే ఆరునెలల సమయం అయినా కచ్చితంగా పట్టేది. కానీ ప్రస్తుతం అలా కాదు. ఈ రోజు విడుదలైన సినిమా అతి తక్కువ సమయంలోనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి వస్తుంటుంది. కొన్ని సినిమాలు థియేటర్లలో సంచలనం విజయం సాధించిన తర్వాత కూడా ఓటీటీలో అదే రేంజ్ సక్సెస్ ను సాధిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ ను సాదించిందో తెలిసిందే.

ఇప్పుడు యానిమల్ సినిమా ఓటీటీలో విడుదలై అక్కడ కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ ను సంపాదింస్తుంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదలైన ఈ సినిమా సంచలనమే సృష్టిస్తుంది. అయితే యానిమల్ రేంజ్ లోనే మిగితా రెండు సినిమాలు కూడా ఇదే తరహాలో వ్యూస్ ను సంపాదిస్తున్నాయి. అవి ఏంటి అనుకుంటున్నారా? ప్రస్తుతం జీ5లో బహదూర్ అనే సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారత ఆర్మీ తొలి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్ షా జీవితం ఆధారంగా వచ్చింది.

ఈ సినిమాను ఆర్ ఎస్ విపి మూవీస్ బ్యానర్ పై రోనీ స్క్రూవాలా నిర్మించారు. విక్కీ కౌషల్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, నీరజ్ కబీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన థియేటర్ లలో విడుదలై యానిమల్ సినిమా తరహాలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. జనవరి 26 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంటుంది.

ఇక ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ శర్మ జీవితాన్నిఆధారంగా చేసుకొని 12 th ఫెయిల్ తెరకెక్కగా అక్టోబర్ 27న విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈసినిమా ఓటీటీలో కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తుంది. డిసెంబర్ 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అన్ని భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే థియేటర్ లలో కన్నా ఓటీటీలోనే ఈ సినిమాకు మంచి ఆదరణ దొరికింది. తాజాగా ఓటీటీ లో వచ్చిన సినిమాల్లో టాప్ త్రీ లో ఈ మూడు సినిమాలు ఉన్నాయి.