Balayya Babu: బాలయ్య బాబు కొత్త సినిమా అయిన భగవంత్ కేసరి సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ నిన్న జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాలయ్య బాబుతో ప్రస్తుతం సినిమా చేస్తున్న డైరెక్టర్ బాబి, అలాగే బాలయ్య బాబుకు ఈ ఇయర్ సంక్రాంతికి మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని, అలాగే ఇంకో డైరెక్టర్ అయిన వంశీ పైడిపల్లి ముగ్గురు కూడా చీఫ్ గెస్ట్ లు గా రావడం జరిగింది.
ఇక వీళ్లలో ముందు గా బాబీ బాలయ్య బాబు గురించి చాలా అద్భుతంగా మాట్లాడి ఆయన గొప్పతనం గురించి చెప్తూ వచ్చారు. వీళ్ళు ముగ్గురు డైరెక్టర్లు కూడా గొప్ప మాటలు మాట్లాడుతూ ఆయన ఎలాంటి వారు ఆయన గొప్పతనం ఎంటి అనేది ప్రేక్షకులకి చెప్పే ప్రయత్నం చేశారు. బాలయ్య బాబు తో ప్రస్తుతం సినిమా చేస్తున్న బాబి బాలయ్య బాబు గురించి మాట్లాడుతూ ఆయన ఒక చిన్న పిల్ల వాడి మనస్తత్వం ఉన్న వ్యక్తి,మనసులో ఏది అనిపిస్తే అది చేస్తాడు.
నేను ఒకసారి పూరి జగన్నాధ్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ బాలయ్య బాబు ఉన్నారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆయన పని మీద అక్కడినుంచి వెళ్లిపోయారు. అప్పుడు పూరి జగన్నాథ్ బాలయ్య బాబు గురించి నాతో చెప్పిన మాట ఏంటి అంటే చాలామంది హీరోలు సక్సెస్ లో ఉన్నప్పుడే డైరెక్టర్లకు సినిమా ఛాన్సులు ఇస్తారు. కానీ బాలయ్య బాబు మాత్రం అలా కాదు మనం సక్సెస్ లో ఉన్న ఫెయిల్యూర్ లో ఉన్న ఒక్కసారి మనల్ని నమ్మాడు అంటే మనకు ఛాన్స్ ఇస్తాడు అలాగే మనం చచ్చిపోయేంతవరకు మనల్ని గుర్తు పెట్టుకుంటాడు.అలాంటి మంచి మనస్తత్వం కల వ్యక్తి ఆయన అని చెప్పి వీలైతే నువ్వు కూడా ఆయనతో ఒక సినిమా ప్లాన్ చేయమని చెప్పాడు. అదేవిధంగా ఇప్పుడు మా కాంబోలో ఒక సినిమా కూడా రాబోతుంది అంటూ చెప్పాడు…
ఇక మరో డైరెక్టర్ అనే గోపీచంద్ మలినేని కూడా బాలయ్య గురించి చాలా గొప్ప మాటలు మాట్లాడుతూ ఆయనతో సినిమా చేయడం నా అదృష్టం అంటూ చెప్పాడు.ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది బాలయ్య బాబు తో సినిమా చేసిన డైరెక్టర్ గా కాదు.సమరసింహారెడ్డి ఫస్ట్ డే థియేటర్లో చూస్తూ పోలీసులు చేత దెబ్బలు తిన్న ఒక అభిమాని గానే బాలయ్య బాబు గారి ఫంక్షన్ కి వచ్చాను అని చెప్పాడు.అలాగే ఇండస్ట్రీలో మమ్మల్ని అందరినీ ఒంగోలియన్స్ అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే మేము ఒంగోలు నుంచి వచ్చాము కాబట్టి ఈ సంవత్సరం సంక్రాంతికి ఒక ఒంగోలియన్ అయినా నేను బాలయ్య బాబుతో సినిమా తీసి హిట్ కొట్టాను…ఇప్పుడు దసరాకి మరో ఒంగొలియన్ అయిన అనిల్ రావిపూడి హిట్టు కొట్టి చూపిస్తాడు అంటూ చాలా గొప్ప మాటలు మాట్లాడాడు…
అలాగే మరో డైరెక్టర్ అయిన వంశీ పైడిపల్లి కూడా బాలయ్య బాబు గురించి అద్భుతమైన మాటలు మాట్లాడుతూ నేను బాలయ్య బాబుతో సినిమా చేయకపోయినప్పటికీ బాలయ్య బాబు గారి గొప్పతనం గురించి నాకు తెలుసు ఆయన క్యాన్సర్ హాస్పటిల్ పెట్టి చాలామంది ప్రజలకు వైద్యాన్ని అందిస్తూ చాలామంది ప్రాణాలను కూడా కాపాడుతున్నారు. రీసెంట్ గా మా అంకుల్ కి కూడా క్యాన్సర్ బారిన పడితే అయనని ఆ హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది.
అప్పుడు అక్కడ చాలామంది పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు.ఇంతకు ముందు బాలయ్య బాబు గొప్పతనం గురించి విన్నాను కానీ అక్కడికి వెళ్ళాక డాక్టర్లతో మాట్లాడక బాలయ్య బాబు గారి గొప్పతనం ఎంటి అనేది ప్రత్యక్షంగా చూసాను అంటూ ఆయన చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ఇక ఫ్యూచర్ లో బాలయ్య బాబుతో వంశీ పైడిపల్లి సినిమా కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…