Rajamouli Birthday: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది గొప్ప దర్శకులు ఉండొచ్చు, ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి ఉండొచ్చు, కానీ రాజమౌళి(SS Rajamouli) సృష్టించిన చరిత్ర మాత్రం సువర్ణాక్షరాలతో లిఖించదగినది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా సినిమాకు తాను ఎదగడమే కాకుండా, మన ఇండస్ట్రీ రేంజ్ ని కూడా పెంచుతూ వెళ్ళాడు. ఫలితంగా నేడు హాలీవుడ్ లో కూడా మన తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడమే కాకుండా, ఆస్కార్ అవార్డు ని కూడా తీసుకొచ్చాడు. నేడు మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లో తమ సినిమాలను విడుదల చేస్తున్నారంటే, అందుకు ముఖ్య కారణం రాజమౌళి నే. అలాంటి రాజమౌళి పుట్టిన రోజు నేడు. దీంతో సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నాడు. అలా బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీరవాణి రాజమౌళి గురించి పాడిన ఒక పాటని సోషల్ మీడియా లో నెటిజెన్స్ షేర్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది.
రాజమౌళి ఎమోషనల్ అయ్యే వ్యక్తి కాదు, అంతకు ముందు ఎప్పుడూ కూడా ఏ సందర్భంలోనూ ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం మనం చూడలేదు. కానీ బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అలా కీరవాణి తన గురించి పాట పడడంతో రాజమౌళి బాగా ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టుకుంటాడు. ఈ వీడియో ఎన్ని సార్లు చూసినా ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు అయినప్పటికీ, వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ స్వచ్ఛమైన బాండింగ్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇండస్ట్రీ లో ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. కానీ రాజమౌళి తన మొదటి సినిమా నుండి ఇప్పుడు మహేష్ బాబు తో చేస్తున్న సినిమా వరకు, తన ప్రతీ చిత్రానికి కీరవాణి నే సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడు.
బాహుబలి 2 చిత్రం తో సంగీతానికి రిటైర్మెంట్ ఇచ్చి విశ్రాంతి తీసుకోవాలని కీరవాణి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అధికారిక ప్రకటన చేసాడు. అప్పటి నుండే రాజమౌళి బాగా ఎమోషనల్ అయ్యాడు. ఇక స్టేజి మీదకు ఎక్కి కీరవాణి ని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేక పోయాడు. ఇన్నేళ్లు కలిసి పని చేసాము, ఇప్పుడు సినిమాలు మానేస్తే ఎలా అనే బాధ రాజమౌళి లో ఆరోజు స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత ఆయన కీరవాణి కి ఏమి చెప్పి ఒప్పించాడో ఏమో తెలియదు కానీ, రిటైర్మెంట్ ఆలోచనని కీరవాణి విరమించుకున్నాడు. పొరపాటున బాహుబలి తర్వాత రిటైర్మెంట్ ఇచ్చి ఉండుంటే నేడు #RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు ని అందుకునే అద్భుతమైన అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చేది.
ఈ వీడియో ఎన్ని సార్లు చూసి ఉంటానో… #HBDSSRajamouli @ssrajamouli pic.twitter.com/jldkoTKFMu
— H A N U (@HanuNews) October 10, 2025