Tholi Prema re-release advance bookings: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో మాత్రమే కాదు, టాలీవుడ్ హిస్టరీ లోనే ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీ లిస్ట్ తీస్తే అందులో ‘తొలిప్రేమ'(Toliprema Re Release) చిత్రానికి కచ్చితంగా స్థానం ఉంటుంది. ఎన్ని సార్లు ఈ చిత్రాన్ని చూసినా ఒక ఫ్రెష్ మూవీ ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఈ సినిమాకు ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ కేవలం చిరంజీవి గారి తమ్ముడిగానే ఇండస్ట్రీ లో గుర్తించేవారు. కానీ ఈ సినిమా విడుదల తర్వాత ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. యూత్ ఆడియన్స్ లో విపరీతమైన కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది ఈ చిత్రం. ఈ సినిమాతోనే నిర్మాత దిల్ రాజు సినీ ప్రస్థానం గ్రాండ్ గా మొదలైంది. కేవలం 70 లక్షల రూపాయలకు అప్పట్లో ఆయన ఈ చిత్రాన్ని కొనుగోలు చేసాడు. కేవలం సంధ్య థియేటర్ నుండే కోటి 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
దీనిని బట్టీ ఆ రోజుల్లో ఈ చిత్రం సృష్టించిన సునామీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో నిర్మాత దిల్ రాజు కి డబ్బులు అవసరమైనప్పుడల్లా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసుకునేవాడట. ఎన్ని సార్లు రీ రిలీజ్ చేసినా కాసుల కనకవర్షం కురిసేది ఆ రోజుల్లో. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని 2023 వ సంవత్సరం లో వాలెంటైన్స్ డే సందర్భంగా ఒకసారి విడుదల చేశారు. రెస్పాన్స్ అదిరిపోయింది. దాదాపుగా కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మళ్ళీ ఈ చిత్రాన్ని ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 14 వ తారీఖున ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని బుక్ మై షో లో మొదలు పెట్టారు.
సంధ్య థియేటర్ లో ఉదయం 8 గంటల షో బుకింగ్స్ ఓపెన్ చేసిన పది నిమిషాల లోపే హౌస్ ఫుల్ అయ్యింది. మిగిలిన థియేటర్స్ కి సంబంధించిన బుకింగ్స్ కూడా ఒక్కొక్కటిగా వదులుతూ ఉన్నారు. అయితే ఈ సినిమా రీసెంట్ గా విడుదలైన ‘ఖలేజా’ మూవీ ఫుల్ రన్ రికార్డు ని బద్దలు కొడుతుందా లేదా? అని ఇప్పటి నుండే నెటిజెన్స్ అంచనాలు వేసుకుంటున్నారు. కానీ తొలిప్రేమ చిత్రాన్ని ఈసారి పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రోత్సహించడం లేదు. ఎందుకంటే ఈ సినిమా విడుదల అవ్వడానికి ఎలాంటి సందర్భం లేదు. పైగా ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇలాంటి సమయంలో ఈ రీ రిలీజ్ అవసరం లేదు అనేది పవన్ కళ్యాణ్ అభిమానుల అభిప్రాయం. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన ప్రశ్న. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.