Highest Grossing Movie: ప్రతి సినిమా కూడా సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతోనే దర్శక నిర్మాతలు ఆ సినిమాలను తీస్తూ ఉంటారు.ఇక నిజానికి ఒక సినిమా సక్సెస్ ఫుల్ గా ఆడాలి అంటే ఆ సినిమాలో స్టోరీ అనేది ముఖ్యపాత్ర వహిస్తుంది.ముఖ్యంగా కంటెంట్ బావుంటే ఏ సినిమా అయిన కలెక్షన్ల రికార్డులను సృష్టిస్తుంది అనేది మనం ఇంతకు ముందు చాలా సినిమాల విషయం లో చూశాం. ఇక మన ఇండియాలో చాలా సినిమాలు మంచి కాన్సెప్ట్ తో వచ్చి సూపర్ డూపర్ హిట్స్ గా మిగిలాయి. ఇక ఇండియాలో ఇప్పటి వరకు బాహుబలి 2 సినిమా 2000 కోట్ల వసూళ్లను కలెక్ట్ చేయగా, ఇప్పటికీ ఇండియా లో ఆ సినిమానే టాప్ పొజిషన్ లో కొనసాగుతుంది.
అయితే హాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన బార్బీ సినిమా మాత్రం ప్రపంచ వ్యాప్తం గా ఇప్పటికే ఎనిమిది వేల కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి ఈ ఇయర్ ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాగా చరిత్రలో నిలిచింది. ఇక ఈ సినిమా జూలై 21 వ తేదీన రిలీజ్ అయినప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమాకి ఎనిమిది వేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి… మర్గొట్ రాబీ, ర్యాన్ గ్లోసింగ్, క్లెట్ మెట్ కిన్నన్, విల్ ఫెర్రెర్ అమెరికా ఫెరెరా లాంటి హాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా కి గ్రేట్ గెర్విగ్ దర్శకత్వం వహించారు…
అయితే ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రావడం వల్ల ప్రేక్షకులందరిని మెప్పిస్తూ తమదైన రీతిలో అన్ని భాషల్లో ఇప్పటి వరకు ఘన విజయాన్ని సాధించడమే కాకుండా 8000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టింది అంటే మామూలు విషయం కాదు. ఏ హాలీవుడ్ సినిమాకి అందనంత రేంజ్ లో ఈ సినిమా ఈ సంవత్సరం కలెక్షన్లను సాధించిన సినిమాగా నిలిచింది…అయితే దర్శకుడు గెర్విగ్ మేకింగ్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ గా నిలిచింది. ముఖ్యంగా గా కొన్ని సీన్లు ఔట్ ఆఫ్ ది ఎమోషన్ లో తెరకెక్కించడం వల్ల ఈ సినిమా చూసిన చాలా మంది ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు…
అందుకే ఈ సినిమా ఈ సంవత్సరం లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన హాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఇక ప్రతి సినిమా కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్ తో వస్తే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అనేది మనం చాలా సార్లు చూశాం ఇక ఇప్పుడు ఈ సినిమా విషయం లో మరోసారి ప్రూవ్ అయింది. కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలు సక్సెస్ అవుతాయి…