Box Office Review: ఈ వీక్ బాక్సాఫీస్ బోసి పోయింది. మరోవైపు వారాంతం కూడా వెళ్ళిపోయింది. రిలీజ్ అయిన మూడు తెలుగు డైరెక్ట్ చిత్రాలు బయ్యర్లకు చుక్కలు చూపించాయి. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటే.. మాకు అవసరం లేదంటూ మెజార్టీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బిలోవ్ ఏవరేజ్ కే పరిమితం చేశారు. ఇక ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ అంటే.. అస్సలు కాదు అంటూ సగర్వంగా ఈ సినిమాకి ప్లాప్ టాక్ మూటగట్టారు. మూడో సినిమా ‘శాకిని డాకిని’ పరిస్థితి అయితే మరీ దారుణం. ఈ మధ్య కాలంలో సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో వచ్చిన బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇదే. నిజానికి ఈ చిత్రం కోసం హీరోయిన్లు నివేదా థామస్ – రెజీనా లు చాలా తపన పడ్డారు. ప్రతి సీన్ లో వారి కష్టం కనిపిస్తూనే ఉంటుంది. ఒక మాస్ హీరోలా ఇద్దరూ పోటీ పడి మరీ స్టంట్స్ చేశారు. కానీ, పాత్రల మధ్య బరువైన భావోద్వేగాలు మిస్ కావడంతో.. వారి హోం వర్క్ అంతా రీల్ లో పోసిన వేస్ట్ షాట్స్ అయిపోయాయి. నిజానికి దర్శకుడు సుధీర్ వర్మ మేకింగ్ స్టైల్ లో డెప్త్ ఉంటుంది. అతని మొదటి సినిమా స్వామీ రా రా చిత్రంతోనే ఇది ఘనంగా రుజువు అయ్యింది. అలాంటి డైరెక్టర్ కూడా ఈ సినిమా విషయంలో స్క్రీన్ వెనుక పేలవంగా మిగిలిపోయాడు. ఒంటరి అమ్మాయిల జీవితాలను చిన్నాభిన్నం చేసే ఓ ముఠాను ఇద్దరు అమ్మాయిలు ఎలా అరికట్టారు? అనేది మెయిన్ పాయింట్. పాయింట్ లోనే పెయిన్ ఉంది. కానీ, సినిమాలో ఆ పెయిన్ మిస్ అవ్వడం విచిత్రం. పైగా ఈ సినిమా విషయంలో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడంలో, ఇంట్రెస్టింగ్ గా డ్రామాను ఎలివెట్ చేయడంలో సుధీర్ వర్మ తడబాటు పడ్డాడు. దీనికితోడు రొటీన్ వ్యవహారాల తంతుతో విసిగించాడు. ఫలితంగా సినిమా బెడిసికొట్టింది.

మరో సినిమా ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సినిమా కూడా రెగ్యులర్ ప్రేమ కహానీలతో.. మరియు కామెడీ షోలలో వాడి పడేసిన సిల్లీ జోకుల సమాహారంతో ఈ చిత్రం థియేటర్స్ లో పూర్తిగా తేలిపోయింది. అయితే, కిరణ్ అబ్బవరం ఈ సినిమా ప్రమోషన్స్ తో చాలా ప్రయాస పడ్డాడు. అతడి కష్టం ఫలితంగా బీసి సెంటర్స్ లో ఓ మోస్తరుగా వసూళ్లు వస్తున్నాయి. కానీ, మల్టీప్లెక్స్ ప్రేక్షకులు మాత్రం ఈ ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ చిత్రాన్ని మాకొద్దు బాబోయ్ అంటూ డిజ్ లైక్ బటన్ కొట్టేస్తున్నారు. ఇక ముచ్చటగా మూడో సినిమా “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. సినిమా టైటిల్ లోనే ఏదో చెప్పాలి అంటున్నారు.. కచ్చితంగా పెద్ద కథే ఉంటుంది అనుకుని వెళ్లిన ప్రేక్షకులు నిరుత్సాహంతో బయటకు వచ్చేస్తున్నారు.
Also Read: Kiran Abbavaram: 90 % నష్టాలు.. ఒక్క ప్లాప్ తో పాతాళానికి పడిపోయిన క్రేజీ హీరో.. ఇంతకీ ఎవరా హీరో ?

అసలు ఈ చిత్రంలో చర్చించిన పాయింట్ లోనే క్లారిటీ మిస్ అయింది. తన ‘సమ్మోహనం’ సినిమా స్క్రిప్ట్ లో మిగిలిపోయిన సీన్స్ ను కలిపేసి ఇంద్రగంటి ఈ సినిమాని వండి ఉంటాడు. సినిమా చూశాక, సినిమాల పై అవగాహన ఉన్న ప్రేక్షకుడికి కలిగే అభిప్రాయం ఇదే. అందుకే, సీన్స్ మధ్య సరైన కలయిక కూడా లేదు. ఎలాగూ ప్లో లేదు, అలాగే ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోయింది ఈ సినిమాలో. ఇక ఈ సినిమా బిజినెస్ పరంగా చూసుకుంటే.. కాస్త ఎక్కువ రేట్లు పెట్టి నెత్తిన వేసుకున్నారు బయ్యర్లు. ప్రస్తుతం నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఓవరాల్ గా ఈ వీక్ బాక్సాఫీస్ రివ్యూ ప్రకారం.. ఈ మూడు చిత్రాల ఫైనల్ రన్ ముగిసేనాటికి ఏ సినిమా 3 కోట్ల దాటే సూచనలు కనిపించడం లేదు. మొత్తానికి ఈ మూడు చిత్రాలు డిజాస్టర్ అవ్వడానికి గట్టిగానే పోటీ పడ్డాయి
Recommended videos:

