Bigg Boss Contestent : ఈ ట్రాన్స్ జెండర్ బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్… ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?

వైల్డ్ కార్డుతో రావడం అర్జున్ కి మైనస్ అయ్యింది. షో ప్రారంభం నుండి ఉంటే అతడు టైటిల్ రేసులో ఉండేవాడు. అయితే ఈ షో కారణంగా అర్జున్ అంబటికి బంపర్ ఆఫర్ దక్కింది

Written By: NARESH, Updated On : December 25, 2023 7:55 pm
Follow us on

Bigg Boss Contestent :  పై ఫోటోలో ట్రాన్స్ జెండర్ ని చూశారు కదా. ఆ ఫోటోలో ఉంది మీకు బాగా తెలిసిన నటుడు. బిగ్ బాస్ తెలుగు షోలో కంటెస్టెంట్ చేశాడు. ఎవరో తెలిస్తే మీరు అతనా? అని షాక్ అవుతారు. ఇటీవల బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ గా ముగిసింది. ఈ సీజన్ ఫైనలిస్ట్స్ లో అర్జున్ అంబటి ఒకరు. తనే ఈ ట్రాన్స్ జెండర్ గెటప్ లో ఉంది. సీరియల్ నటుడు అయిన అర్జున్ అంబటి బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు.

ఐదు వారాల అనంతరం మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన హోస్ట్ నాగార్జున అంబటి అర్జున్, పూజ మూర్తి, భోలే షావలి, నయని పావని, అశ్విని శ్రీ లను హౌస్లో కి పంపించారు. వీరిలో అర్జున్ మాత్రమే ఫైనల్ కి వెళ్ళాడు. నయని పావని, పూజ మూర్తి అయితే మొదటి రెండు వారాల్లో ఎలిమినేట్ అయ్యారు. అర్జున్ తన గేమ్ తో ఆకట్టుకున్నాడు. టాస్క్ లలో సత్తా చాటాడు. ఖచ్చితంగా మాట్లాడేవాడు.

ఇక కష్టపడి ఫినాలే అస్త్ర గెలిచిన అర్జున్ నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు. ఈ సీజన్లో అనూహ్యంగా ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ కి వెళ్లారు. అర్జున్ అంబటికి ఆరో స్థానం దక్కింది. 5వ స్థానంలో ప్రియాంక నిలిచింది. యావర్ రూ. 15 లక్షలు తీసుకుని 4వ స్థానంతో టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు. శివాజీకి 3వ స్థానం. అమర్ రన్నర్, ప్రశాంత్ విన్నర్ అయ్యారు.

వైల్డ్ కార్డుతో రావడం అర్జున్ కి మైనస్ అయ్యింది. షో ప్రారంభం నుండి ఉంటే అతడు టైటిల్ రేసులో ఉండేవాడు. అయితే ఈ షో కారణంగా అర్జున్ అంబటికి బంపర్ ఆఫర్ దక్కింది. ఏకంగా రామ్ చరణ్ మూవీలో ఆఫర్ కొట్టేశాడు. ఈ షోకి గెస్ట్ గా వచ్చిన దర్శకుడు బుచ్చిబాబు సానా తాను రామ్ చరణ్ తో ప్రకటించిన చిత్రంలో పాత్ర ఆఫర్ చేశాడు. దాంతో చరణ్ ఉబ్బితబ్బిబయ్యాడు. వచ్చే ఏడాది రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు