Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సరికొత్తగా సాగుతుంది. కొత్త ట్విస్ట్ లు, సర్ప్రైజ్ లు ఇస్తూ బిగ్ బాస్ ఆకట్టుకుంటున్నాడు.ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ సైతం ఊహించని విధంగా షోలో అంతా కొత్తగా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్. ఐదు వారాలు పూర్తి కాగానే బిగ్ బాస్ 2.0 ని గత ఆదివారం లాంచ్ చేశారు. మరో ఐదుగురు సెలెబ్రేటిస్ ఇంట్లోకి అడుగు పెట్టారు. వారి రాకతో సీజన్ మరింత ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా బిగ్ బాస్ విన్నర్ కి రూ. 50 లక్షలు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. గత మూడు సీజన్స్ నుంచి క్యాష్ ప్రైజ్ తో పాటు టైటిల్ స్పాన్సర్స్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్స్ కూడా అందజేస్తున్నారు. ఇక ఏడో సీజన్ లో విజేతగా నిలిచే కంటెస్టెంట్ కి క్యాష్ ప్రైజ్ తో పాటు కొన్ని లక్షలు విలువ చేసే ఒక డైమండ్ నెక్లెస్ సెట్ ఇవ్వబోతున్నట్లు వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున తెలిపారు.
దీనిని టైటిల్ స్పాన్సర్ జోయాలుకాస్ సంస్థ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఈ సీజన్ కి సంబంధిచిన విన్నర్ క్యాష్ ప్రైజ్ గురించి ఇంత వరకు ప్రస్తావించలేదు నాగార్జున. ఈ సీజన్ చివరిలో దీనిని రివీల్ చేసే అవకాశం ఉంది. ఇక డైమండ్ నెక్లెస్ గురించి హౌస్ మేట్స్ తో చెప్పాడు నాగార్జున. ఇది విని కంటెస్టెంట్స్ చాలా సంతోషించారు. ఆ నెక్లెస్ చూసి దానిని గెలుచుకోవాలనే తపన తో కనిపించారు. ఇలా సర్ప్రైజ్ లు ఇస్తూ కంటెస్టెంట్స్ లో టైటిల్ గెలవాలనే తపన పెంచేస్తున్నాడు బిగ్ బాస్.
ఇక ఆరో వారానికి గాను అమర్ దీప్, ప్రిన్స్ యావర్, తేజా, శోభా శెట్టి, నయని పావని, అశ్విని, పూజా మూర్తి నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. అందరికంటే తక్కువ ఓట్లతో శోభా శెట్టి, పూజా మూర్తి డేంజర్ జోన్లో ఉన్నారని సమాచారం.