Sankranthi 2026: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు… నిజానికి ఇండస్ట్రీ లో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. సక్సెస్ ఫుల్ సినిమాలను తీసిన హీరోలను మాత్రమే ప్రేక్షకులు పట్టించుకుంటారు. అలాగే వాళ్లకు మాత్రమే స్టార్ డైరెక్టర్ నుంచి స్టార్ ప్రొడ్యూసర్ల నుంచి సినిమాలను చేసే అవకాశం వస్తుంది. ఇక ఇలాంటి క్రమంలో యంగ్ హీరో స్టార్ హీరో అనే తేడా లేకుండా సక్సెస్ లు మాత్రమే ఇక్కడ మాట్లాడతాయనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది…ఇక ఇప్పటివరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసినప్పటికి సక్సెస్ లను సాధించిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ మంచి గుర్తింపు ఉంటుంది.
ఇక ఈ సంక్రాంతికి వచ్చిన ఐదు సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి. ప్రభాస్ రాజాసాబ్ సినిమా కొంతవరకు నిరాశపర్చినప్పటికి మిగిలిన నాలుగు సినిమాలు సైతం ప్రేక్షకులకు ఎంతో కొంత సంతృప్తిని మిగిల్చాయి. ముఖ్యంగా మన శంకర్ వరప్రసాద్ సినిమా సంక్రాంతి హిట్టుగా నిలిచింది. ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా సైతం హిట్ గా నిలిచింది.
అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి లాంటి సినిమాలు సైతం సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి సూపర్ సక్సెస్ లను చేయాలని ప్రతి ఒక్క హీరో అనుకుంటున్నాడు…ఇక ఈ సంక్రాంతికి అందరు ఒక్కొక్క విజయాన్ని మాత్రమే అందుకుంటుంటే కొంతమంది మాత్రం రెండు మూడు విజయాలను అందుకొని వాళ్లకు ఆ సినిమా చాలా స్పెషల్ గా నిలిచిందనే చెప్పాలి…
గత సంవత్సరం సంక్రాంతి వస్తున్నాం సినిమాలతో బుల్లి రాజుగా గుర్తింపు సంపాదించుకున్న రేవంత్ మన శంకర్ వరప్రసాద్ సినిమాలో కూడా మెరిసాడు. ఇక దాంతోపాటు అనగనగా ఒక రాజు సినిమాలో కూడా నటించాడు. ఈ రెండు సినిమాల్లో సైతం కనిపించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు…
రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ బామ్మ గా నటించిన జరీనా వహెబ్ ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఆమె మన శంకర్ వరప్రసాద్ సినిమాలో చిరంజీవికి తల్లిగా నటించి సూపర్ సక్సెస్ ని సాధించింది…
‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన భీమ్స్ సైతం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి…
