Tollywood To Director
Viral Photo : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేనివారు అంటూ ఎవరు ఉండరు. సామాన్యుల నుంచి స్టార్ నటీనటులు, డైరెక్టర్ల వరకు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ను అభిమానించే వారే. ప్రస్తుతము కనిపిస్తున్న ఫోటోలో ఉన్న సెలెబ్రెటీ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని. అందుకే తన ఇంట్లోనే ఇతను పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పోస్టర్ అంటించుకున్నాడు. ఫోటోలో కనిపిస్తున్న నటుడు ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక సెన్సేషన్. కానీ ఇతను టాలీవుడ్లో పెద్దగా సినిమాలు చేయలేదు. ఇప్పటివరకు ఇతను కేవలం మూడు సినిమాలు మాత్రమే చేశాడు. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి. ఇతను చేసిన చివరి సినిమా ఏకంగా వెయ్యికోట్లకు దగ్గరలో కలెక్షన్లు రాబట్టింది. సూపర్ హిట్ సినిమాలు చేస్తున్న సమయంలోనే కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాడు ఈ దర్శకుడు. ఈ దర్శకుడు చేసే సినిమాలలో హింస ఎక్కువగా ఉంటుందని, అమ్మాయిలను తక్కువ చేసి చూపిస్తాడని ఇతని సినిమాలను కొందరు విమర్శిస్తుంటారు. అయితే ఇలాంటివన్నీ పట్టించుకోకుండా ఈ దర్శకుడు తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ దర్శకులలో ఇతను కూడా ఒకరు. ఈ దర్శకుడు మరెవరో కాదు సందీప్ రెడ్డి వంగ. గతంలో సందీప్ రెడ్డి వంగ మెగాస్టార్ చిరంజీవి గారికి డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తనకు విపరీతమైన అభిమానం అని తెలిపాడు. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ తన యంగ్ ఏజ్ లో పవన్ కళ్యాణ్ పోస్టర్ పక్కన కూర్చొని దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది బాగా వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో తనకు ఇష్టమైన పోస్టర్ను సందీప్ రెడ్డి వంగ తన ఇంట్లో అతికించుకున్నాడు.
తాజాగా దీనికి సంబంధించి మరొక ఫోటోను ఈ దర్శకుడు షేర్ చేశాడు. ఈ దర్శకుడి ఆఫీసులో మెగాస్టార్ చిరంజీవి ఫ్రేమ్ ఉండడం విశేషం. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగ ఇంట్లో ఉన్న ఫోటోలు, పోస్టర్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకుడి కన్నా ముందు అసోసియేట్ దర్శకుడిగా పనిచేశాడు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన కేడి సినిమాకు ఈ స్టార్ దర్శకుడు అసోసియేట్ దర్శకుడిగా పని చేయడం జరిగింది. అలాగే కేడి సినిమాలో ఇతను ఒక కామియో రోల్ లో నటించాడు. అదేవిధంగా సందీప్ రెడ్డి తాను దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి, మహానటి సినిమాలలో కామియో రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడని గతంలోనే సందీప్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లో ఉండనున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే స్పిరిట్ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: This man sitting next to pawan kalyans poster is currently a sensational director in tollywood
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com