S S Rajamouli: రాజమౌళి అంటే తెలుగు లోనే కాదు ఇండియాలోనే అత్యంత క్రేజ్ ఉన్న డైరెక్టర్ అనే చెప్పాలి.ఆయన డైరెక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈయన ఇప్పటివరకు 12 సినిమాలు తీస్తే 12 సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వడం నిజంగా ఆయన పడిన కష్టానికి ప్రతిఫలం అనే చెప్పాలి.ఆయన చేసిన ప్రతి సినిమాలో ఆయనే అన్ని స్వయంగా దగ్గరుండి చూసుకుంటాడు.నిజానికి ఈయన చేసిన ప్రతి సినిమాలో నటులు ఇంతకు ముందు వాళ్ళు చేసిన సినిమాలో కంటే చాలా డిఫరెంట్ గా కొత్త్తగా కనిపిస్తారు ఎందుకంటే ఆయన వాళ్ల స్టైల్ మొత్తం మార్చేసి తన స్టైల్ లోకి ఆ హీరో ని తీసుకువస్తాడు కాబట్టి వాళ్ళు అలా తయారవుతారు.ఇక ఆయన సక్సెస్ లా విషయానికి వస్తే ఆయన తీసిన మొదటి సినిమా అయినా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి మొన్న వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా దాక ఆయన తీసిన ప్రతి సినిమాలో ఎమోషన్ అనేది చాలా బాగా ఉంటుంది.
ఆయన దానిని చాలా బాగా వర్క్ అవుట్ చేస్తాడు.అందుకే ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూ ల్లో కూడా రాజమౌళి మాట్లాడుతూ ఒక సినిమా హిట్ అవ్వాలంటే దానికి ఎమోషన్ అనేది చాలా కీలకం అదే దానికి ప్రాణం లాంటిది అని ఆయన చెప్పాడు. అయితే ఆయన కూడా ఎమోషన్ లేకుండా సినిమా చేయను అని చెప్పాడు నిజానికి ఈయన సినిమాల్లో వచ్చే ఎమోషన్ తో కూడిన ఫైట్స్ జనాలకి చాలా బాగా నచ్చుతాయి. అందుకే ఆయన ఒక పీడిత వర్గం నుచి హీరో ని పైకి లేపుతూ ఉంటాడు. ఉదాహరణకు ఛత్రపతి సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ అంత పీక్స్ లో ఉండటానికి కారణం అణిచివేత కు గురి అవుతున్న మనుషుల్లో నుంచి ఒక వ్యక్తి బయటికి వచ్చి అక్కడ జరుగుతున్నా సిస్టం ని ఎదురించడాన్ని ఆయన బలం గా చూపించారు అందుకే ఆ సీన్లు థియేటర్ లో జనాల చేత విజిల్స్ వేసేలా చేస్తాయి…
ఇక ఈ సినిమా విషయాన్ని పక్కన పెడితే ఆయన చేసిన విక్రమార్కుడు సినిమాలో చెంబల్ అనే ప్రాంతాన్ని తీసుకొని అక్కడ ప్రజలు పడే ఇబ్బందులని చూపిస్తూ ఆయన వచ్చి దానికి పరిష్కారం చూపించడమే ఆ సినిమా విజయం లో భాగం…ఇక ఈయన తీసుకున్న ప్రతి సినిమాలో ఎమోషన్ ఒక్కటే ప్రదానం గా సాగుతుంది.నిజానికి ఈయన చేసిన సినిమాల్లో హీరోలు కూడా చాలా శక్తివంతమైన వాళ్ళు గా కనిపిస్తారు ఇక విలన్లు అయితే హీరోలకంటే స్ట్రాంగ్ గా ఉంటారు.
ఎందుకంటే అంత బలమైన విలన్ ని ఎదురుకున్నప్పుడే హీరో కూడా అతనికంటే బలవంతుడు అవుతాడు కదా అందుకే అలా ఆ సీన్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది అని ఆయన నమ్ముతాడు. అందుకే ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా విలన్ స్ట్రాంగ్ గా ఉంటాడు. ఇక బాహుబలి సినిమాలో చూసుకుంటే విలన్ రానా ప్రభాస్ కంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు.దీన్ని బట్టి రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే ఒకటి ముందు స్టోరీ లో ఎమోషన్ ఉండేలా సీన్స్ రాయిస్తాడు,దాని తర్వాత ఆ సీన్లకి ఎలివేషన్స్ ఇస్తూ దాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తాడు.అందుకే రాజమౌళి ఇండియా లోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు…