Samantha: నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఒంటరితనం భరించలేక స్పీడు పెంచింది. యాడ్స్, సినిమాలు, వెబ్ సిరీస్ ఇలా ఎందులో అవకాశం వస్తే అందులో నటిస్తూ డబ్బులు వెనకేసుకుంటోంది. తనను తాను బిజీగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.
తాజాగా సమంత ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆఫర్ ను వదిలేసినట్లుగా తెలుస్తోంది. రెమ్యూనరేషన్ కారణంగానే నో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్ట్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా అప్పట్లో విడుదల చేసిన మోషన్ పోస్టర్ గ్లింప్స్ ఆకట్టుకుంది. అభిమానుల్లో హైప్ క్రియేట్ చేసింది. దీంతో సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి.
Also Read: Naga Chaitanya: చాలా బోర్ గా అనిపించింది అందుకే డిస్కనెక్ట్ అయ్యా… పర్సనల్ మేటర్ చెప్పిన చైతూ
ఆర్ఆర్ఆర్ తర్వాత కథల పట్ల, సన్నివేశాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలోనే పక్కాగా అన్ని కుదిరాకే సెట్స్ పైకి వెళ్లాలని టీం భావిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసనగా సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని కొరటాల శివ భావించారట.. గతంలో వీరిద్దరూ కలిసి ‘జనతా గ్యారేజ్’లో నటించారు. దీంతో మరోసారి వీరి జోడి సెట్ చేయాలని కొరటాల భావించినట్టు తెలిసింది.
అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం సమంతను అడిగాడట కొరటాల శివ. కానీ సమంత పారితోషికం విషయంలో కాంప్రమైజ్ కాలేదట.. కొరటాల శివ ఈ సినిమాకు రెండున్నర కోట్లు ఇస్తానని ఆఫర్ చేయగా.. సమంత మాత్రం రూ.4 కోట్లకు తక్కువ తీసుకోనని చెప్పిందట.. తను అడిగినంత కొరటాల ఇవ్వకపోవడంతో సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత భారీ ప్రాజెక్టులు చేస్తోంది సమంత. బాలీవుడ్ లో , దేశంలోని పలు భాషల్లో బిజీ అయ్యింది. ఐటెం సాంగ్ లు కూడా చేస్తోంది. అందుకే ఎన్టీఆర్ తో మూవీ సినిమాకు తక్కువ పారితోషికం విషయంలోనే వదులుకున్నట్టు సమాచారం.
Also Read:Yawn During Pooja: పూజ చేసేటప్పుడు ఆవలింతలు ఎందుకు వస్తాయో తెలుసా?