
Pawan Kalyan Bollywood movie : పవన్ కళ్యాణ్ కి ఉన్న యూనిక్ స్టైల్ మరియు యాటిట్యూడ్ కి ఆయన కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అవ్వాల్సిన హీరో కాదు, పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ భాషల్లో నటించి రజినీకాంత్ రేంజ్ స్టార్ స్టేటస్ సంపాదించగల సత్తా ఉన్నోడు అని అభిమానులు బలంగా నమ్ముతారు.ఎందుకంటే ఆయన యాటిట్యూడ్ ని , ఆయన స్టైల్ ని నచ్చని వాడంటూ ఎవ్వరూ ఉండరు.ఇక డైలాగ్ డెలివరీ మరియు కామెడీ టైమింగ్ లో కూడా ప్రత్యేకమైన శైలి పవన్ సొంతం.
దానిని అందరూ నచ్చుతారు.అలాంటి టాలెంట్ ఉన్న పవన్ కళ్యాణ్ కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయ్యిపోయాడనే అసంతృప్తి ప్రతీ అభిమానిలోను ఉంటుంది.ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ 24 ఏళ్ళ క్రితమే బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు అనే విషయం చాలా మందికి తెలియదు.కానీ అది ఫుల్ లెంగ్త్ సినిమా మాత్రం కాదు, కేవలం రెండు నిమిషాల అతిథి పాత్ర మాత్రమే.
ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో 2000 సంవత్సరం లో విడుదలైన బద్రి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాని హిందీ లో 2004 వ సంవత్సరం లో ‘షార్ట్’ అనే పేరు తో రీమేక్ చేసారు.తుషార్ కపూర్ హీరో గా నటించగా అమీషా పటేల్ మరియు గ్రీసి సింగ్ హీరోయిన్స్ గా నటించారు.హిందీ వెర్షన్ కి కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రారంభం లో ఒక రెండు నిమిషాల అతిథి పాత్రని పోషించాడు.పూరి జగన్నాథ్ రిక్వెస్ట్ ని కాదు అనలేక పవన్ కళ్యాణ్ ఈ గెస్ట్ రోల్ ని చేసాడు.కానీ ఈ సినిమా హిందీ లో డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.కారణం తెలుగు లో పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ని హిందీ లో తుషార్ కపూర్ చేయలేకపోయారు.ఫలితంగా ఈ సినిమా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.అలా పవన్ కళ్యాణ్ నటించిన ఏకైక హిందీ సినిమాగా ‘షార్ట్’ నిలిచిపోయింది.