https://oktelugu.com/

బిగ్ బాస్ చరిత్రలోనే ఇదే తొలిసారి.. అవినాష్‌ రికార్డు !

జబర్ధస్త్ తో చాలామంది కమెడియన్స్ కు లైఫ్ వచ్చింది. అలా పాపులారిటీని సొంతం చేసుకుని కమెడియన్‌ గా గుర్తింపు తెచ్చుకున్నాడు  ముక్కు అవినాష్. ఎన్నో స్కిట్లలో నవ్వించిన అవినాష్ ని  బిగ్ బాస్ మాత్రం చివరకు ఏడిపించాడు. వైల్డ్ కార్డ్ ద్వారా జోకర్ గెటప్‌తో హౌస్‌లోకి ప్రవేశించిన అవినాష్ పరిస్థితి జోకరే అన్నట్టు అయింది. నిజానికి ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచే తన కామెడీ  మార్క్ తో బాగానే ఎంటర్ టైన్ చేశాడు. కేవలం అవినాష్ కామెడీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 7, 2020 / 01:35 PM IST
    Follow us on

    జబర్ధస్త్ తో చాలామంది కమెడియన్స్ కు లైఫ్ వచ్చింది. అలా పాపులారిటీని సొంతం చేసుకుని కమెడియన్‌ గా గుర్తింపు తెచ్చుకున్నాడు  ముక్కు అవినాష్. ఎన్నో స్కిట్లలో నవ్వించిన
    అవినాష్ ని  బిగ్ బాస్ మాత్రం చివరకు ఏడిపించాడు. వైల్డ్ కార్డ్ ద్వారా జోకర్ గెటప్‌తో హౌస్‌లోకి ప్రవేశించిన అవినాష్ పరిస్థితి జోకరే అన్నట్టు అయింది. నిజానికి ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచే తన కామెడీ  మార్క్ తో బాగానే ఎంటర్ టైన్ చేశాడు. కేవలం అవినాష్ కామెడీ సెన్స్ వల్లే చాలా వారాల పాటు అతను నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. బిగ్ బాస్ కూడా తరచూ ఏదో ఒక గొడవతో మూసగా సాగిపోతుందనే అపవాదు మూట కట్టుకోవడం.. కరెక్ట్ గా అప్పుడే అవినాష్ ఎంట్రీ ఇవ్వడం..మొత్తానికి షోకి బాగా ప్లస్ అయింది.

    Also Read: బిగ్ బాస్ లీక్:ఈ వారం బిగ్ బాస్ నామినేషన్ లో ఉండేది వీరే..
    అప్పటివరకు బోర్ గా సాగే బిగ్ బాస్ షోను తన రాకతో నిత్యం కామెడీని పంచుతూ కంటెస్టెంట్లు అందరిలో కామెడీ సెన్స్ ను పెంచాడు. పైగా హౌస్‌మేట్లు అందరినీ ఇమిటేట్ చేయడంతో పాటు వీకెండ్ ఎపిసోడ్స్‌లో అద్భుతమైన టైమింగ్‌తో పంచులు పేలుస్తూ సమంత, నాగార్జున నుంచే కాకుండా ప్రేక్షకుల నుండి కూడా మనోడిలో బెస్ట్ ఎంటర్‌టైనర్ ఉన్నాడు అనే నమ్మకాన్ని సంపాదించాడు. కానీ ఇంత చేసినా అవినాష్ కి మిగిలింది చివరకు ఎలిమినేషనే. అయితే అవినాష్ ను హౌస్ నుండి బయటకు పంపడానికి చాలా డ్రామానే జరిగింది. హౌస్‌లో ముక్కు అవినాష్ కంటెస్టెంట్లు అందరితోనూ కలిసే ఉన్నా.. ఆరియానా గ్లోరీతో మాత్రం కాస్త క్లోజ్ గా ఉండేవాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని ప్రచారం కూడా జరిగింది. దానికి తగ్గట్లుగానే వీరి మధ్య బాండింగ్ కూడా రోజురోజుకూ బాగా పెరిగింది.

    Also Read: మోనాల్ కోసం అవినాష్‌ బలి.. బిగ్ బాస్ పక్షపాత ధోరణి !
    ఇది కూడా చివరకు అతనికి మైనసే అయింది. అలాగే నామినేషన్స్ టాస్కులో ఎవరైనా తనను నామినేట్ చేస్తే అస్సలు తట్టుకోలేకపోయేవాడు. ఆ సమయంలో అతని ప్రవర్తన పై చాలా విమర్శలు వచ్చాయి. అయితే
    బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన అవినాష్ పేరిట ఓ రికార్డు నమోదైంది. బిగ్ బాస్ చరిత్రలోనే వరుసగా రెండు వారాలు ఎలిమినేట్ అయ్యాడు అవినాష్. గత వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడుకున్న అతడు.. ఈ వారం ఇంటి నుంచి వెళ్లిపోక తప్పలేదు. ఇలా ఒకే కంటెస్టెంట్ ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా రెండు సార్లు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించడం బిగ్ బాస్ చరిత్రలో ఇదే మొదటిసారి. బిగ్ బాస్ లో అవినాష్ కథ చివరకు ఇలా ముగిసింది.
    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్