అల్లు అర్జున్ ‘ఐకాన్’పై క్లారిటీ ఇదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తీసిన వేణు శ్రీరామ్ ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తన నెక్ట్స్ మూవీని తీస్తున్నాడు. వకీల్ సాబ్ హిట్ తో వేణు శ్రీరామ్ కు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అయితే వకీల్ సాబ్ సినిమాకు ముందే అల్లు అర్జున్ తో సినిమాను ఖాయం చేశాడు వేణు శ్రీరామ్. ఇప్పటికే అల్లు అర్జున్ మూవీకి ‘ఐకాన్’ అనే టైటిల్ […]

Written By: NARESH, Updated On : April 19, 2021 10:30 am
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తీసిన వేణు శ్రీరామ్ ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తన నెక్ట్స్ మూవీని తీస్తున్నాడు. వకీల్ సాబ్ హిట్ తో వేణు శ్రీరామ్ కు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అయితే వకీల్ సాబ్ సినిమాకు ముందే అల్లు అర్జున్ తో సినిమాను ఖాయం చేశాడు వేణు శ్రీరామ్.

ఇప్పటికే అల్లు అర్జున్ మూవీకి ‘ఐకాన్’ అనే టైటిల్ ను కూడా పెట్టేశాడు వేణు శ్రీరామ్. వకీల్ సాబ్ నిర్మించిన దిల్ రాజునే ఈ ‘ఐకాన్’ను కూడా నిర్మించనున్నారు.

అయితే ‘ఐకాన్’ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలపై నిర్మాత దిల్ రాజు తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ఓ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. తమ నెక్ట్స్ మూవీ ‘ఐకాన్’ అని తేల్చిచెప్పారు.

అల్లు అర్జున్ తో ‘ఐకాన్’ మూవీ ఉంటుందని.. ఇది నాకు బాగా నచ్చిన కథ అని.. పూర్తి స్క్రిప్ట్ రెడీగా ఉంది కనుక వెంటనే ఈ సినిమాను మొదలు పెట్టబోతున్నట్టు దిల్ రాజు స్పష్టం చేశారు.

ఇక పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా కూడా ‘ఐకాన్’ అని సమాచారం. కొరటాల శివతో మూవీ ఆలస్యం కానుంది. కొరటాల-ఎన్టీఆర్ మూవీ అనౌన్స్ చేయడంతో బన్నీ ‘ఐకాన్’ మూవీని ఈ గ్యాప్ లో చేయనున్నారు.