Big surprise in OG Movie: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ఓజీ(They Call Him OG) చిత్రం ఈ నెల 25 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అంటే సినిమా విడుదలకు సరిగ్గా 8 రోజులు ఉన్నాయి అన్నమాట. అందుకే ఎక్కడ చూసినా ఇప్పుడు ఓజీ మేనియా తప్ప మరొకటి కనిపించడం లేదు. ట్విట్టర్ లో అయితే రోజుకు లక్షల సంఖ్యలో ఈ చిత్రం గురించి ట్వీట్లు పడుతున్నాయి. ఇప్పుడు అభిమానులు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరికాసేపట్లో అదిరిపోయే పోస్టర్ తో థియేట్రికల్ ట్రైలర్ ప్రకటన మేకర్స్ నుండి రాబోతుంది. అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా కాసేపటి క్రితమే మొదలైంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు UA సెర్టిఫికెట్ ని ఇస్తారా లేదా A సర్టిఫికేట్ ని ఇస్తారా అనేది సస్పెన్స్ గా మారింది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలోని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ గురించి సోషల్ మీడియా లో ప్రతీ రోజు ఎదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ఆ అప్డేట్ ని చూసి అభిమానులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఈ చిత్రం అకీరానందన్ ఉన్నాడని కొందరు, లేదు రామ్ చరణ్ ఉన్నాడని మరికొందరు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున నిన్న మొన్నటి వరకు ప్రచారం చేశారు. కానీ అది పూర్తిగా ఫేక్ అట కానీ, ఇందులో ప్రభాస్ క్యామియో మాత్రం కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. అది వాయిస్ రూపం లో అవ్వొచ్చు, లేదా వీడియో రూపం లో అవ్వొచ్చు, ఆయన ప్రెజెన్స్ మాత్రం ఈ చిత్రం లో ఉంటుందని, ఆడియన్స్ మెంటలెక్కిపోతారని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లో ఎప్పుడూ చూడని ఒక యాంగిల్ ని చూడబోతున్నారట. అది ఆడియన్స్ కి మాత్రమే కాదు,పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలిసిన ఫ్యాన్స్ కి కూడా సర్ప్రైజ్ గా ఉండబోతుంది అట.
పవన్ కళ్యాణ్ లో చూడని యాంగిల్ ఏమి మిగిలి ఉంది?, సెంటిమెంట్,యాక్షన్, కామెడీ,యాటిట్యూడ్ ఇలా ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో అన్ని యాంగిల్స్ ని చూసేసాము. ఏదైనా యాంగిల్ మిగిలి ఉందంటే, అది నెగిటివ్ యాంగిల్ మాత్రమే. ఓజీ లో మనం పవన్ లోని నెగిటివ్ యాంగిల్ ని చూడబోతున్నామా?, కచ్చితంగా అదే అయ్యుంటుంది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే మరో 8 రోజులు ఆగాల్సిందే. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ఇప్పటికే మొదలైంది. ఇక ఇండియా లో ఈ నెల 20 వ తేదీ నుండి మొదలు పెట్టబోతున్నారు అనే టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రం విడుదలకు ముందే వంద కోట్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.