Mahesh Babu: మహేశ్ బాబు ఎంత స్టార్ హీరో తెలిసిందే. తెలుగులో అగ్రస్థాయి నటుడిగా తన సత్తా చాటుతున్నాడు. రాజకుమారుడు నుంచి సర్కారు పాట వరకు ప్రత్యేకమైన శైలిలో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. నటనలో వైవిధ్యం చూపుతున్నాడు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేక్షకులతో టచ్ లో ఉంటున్నాడు. ఇతరుల సినిమాల మీద కూడా తన అభిప్రాయం వ్యక్తం చేస్తుంటాడు. ఏ సినిమా అయినా హిట్ అయిందంటే ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటాడు. వ్యక్తిగత విషయాల మీద కాకుండా సినిమాలపై తన కామెంట్లు పెడుతుంటాడు.

అంత పెద్ద హీరో కామెంట్లు పెట్టినా కనీసం ఎవరు స్పందించడం లేదు. దీంతో మహేశ్ బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మర్యాదపూర్వకంగా తన మనసులోని మాటను వ్యక్తం చేస్తే కనీసం సమాధానం కూడా ఇవ్వని వారిపై మండిపడుతున్నారు. మహేశ్ బాబు మంచితనానికి ఇదేనా నిదర్శనమని ప్రశ్నిస్తున్నారు. థ్యాంక్స్ అని కూడా సందేశం పెట్టడం లేదు. ఇంతటి దురహంకారం పనికి రాదని కౌంటర్ ఇస్తున్నారు. అగ్ర స్థాయి నటుడైనా అందరు బాగుండాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా అని చెబుతున్నారు.
విక్రమ్ సినిమా విజయం సాధించడంపై మహేశ్ బాబు ట్వీట్ చేశారు. సినిమా బాగుందని చెప్పారు. కానీ ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. విక్రమ్ సినిమా కూడా బ్రహ్మాండమైన హిట్ అయిందని నటులను అందరిని ట్యాగ్ చేస్తే ఒక్కరు కూడా స్పందించలేదు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ మాత్రం మహేశ్ బాబు ట్వీట్ కు థ్యాంక్స్ చెప్పారు. అఖండ సినిమాపై కూడా ట్వీట్ చేసినా ఎవరు స్పందించలేదు. పుష్ప సినిమా కూడా బాగా వచ్చిందని ట్వీట్ చేసినా స్పందన రాలేదు. అంత పెద్ద హీరో ట్వీట్ చేసినా ఎందుకు స్పందించరనే అభిప్రాయాలు వస్తున్నాయి.

సర్కారు వారి పాట విడుదలై విజయం సాధించినా ఇంతవరకు ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు. మహేశ్ బాబు అందరి సినిమాలకు ట్వీట్ చేస్తున్నా అతడి సినిమాకు మాత్రం ఒక్కరు కూడా ట్వీట్ పెట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మహేశ్ బాబు మంచితనమే ఆయనకు ఇలాంటి పరిణామాలు తెచ్చుపెడుతుందని చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ కూడా బాగుందని ట్వీట్ చేసినా ఎవరు స్పందించలేదు. అగ్ర హీరో అనే మాట పక్కన పెట్టి చిన్న సినిమాలకు సైతం తన అభిప్రాయం చెబుతున్నా ఎవరు స్పందించకపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఏ సినిమాకు కూడా ఎలాంటి ట్వీట్ చేయొద్దని సూచిస్తున్నారు.