Ramcharan – Leo : లియోలో రామ్ చరణ్ ఉన్నారు అనడానికి సూపర్ హింట్ ఇదే

విజయ్ - త్రిష జంటగా నటిస్తున్న ఈ సినిమాలో, ఆంటోని దాస్ అనే కీలకమైన పాత్రను సంజయ్ దత్ పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు అని గత కొద్ది రోజుల నుంచి ఒక వార్త హల్చల్ చేస్తోంది. కానీ ఈ వార్త పైన అధికారిక ప్రకటన మాత్రం ఈ సినిమా వారు ఇవ్వలేదు.

Written By: Swathi, Updated On : July 30, 2023 10:47 pm
Follow us on

Ramcharan – Leo : ప్రస్తుతం తమిళ ప్రేక్షకులతో పాటు సౌత్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా దళపతి విజయ్ నటించిన లియో.  లలిత్ కుమార్ – జగదీశ్ పళనిస్వామి నిర్మిస్తున్న ఈ సినిమాకి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. లోకేశ్ కనగరాజ్ గత చిత్రాలు ఖైదీ, విక్రమ్ తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. లోకేష్ యూనివర్సల్ రాబోతున్న లియో చిత్రం పైన కూడా అందుకే ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

విజయ్ – త్రిష జంటగా నటిస్తున్న ఈ సినిమాలో, ఆంటోని దాస్ అనే కీలకమైన పాత్రను సంజయ్ దత్ పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు అని గత కొద్ది రోజుల నుంచి ఒక వార్త హల్చల్ చేస్తోంది. కానీ ఈ వార్త పైన అధికారిక ప్రకటన మాత్రం ఈ సినిమా వారు ఇవ్వలేదు.

ఇప్పుడు మాత్రం ‘లియో’ లో రామ్ చరణ్ కనిపించబోతున్నాడనే దానికి మేకర్స్ హింట్ ఇచ్చారంటూ మరో కొత్త న్యూస్ స్ప్రెడ్ అవుతోంది
‘లియో’ సంజయ్ దత్ గ్లింప్స్‌లో ‘ఆంటోని’ అనే ఒకే ఒక్క మాట వినిపిస్తుంది. సరిగ్గా గమనిస్తే ఆ వాయిస్ రామ్ చరణ్‌దే అంటున్నారు చాలామంది. నిజంగా గొంతు చరణ్‌లానే అనిపిస్తుంది. తన గత చిత్రాల్లానే చరణ్ క్యారెక్టర్‌ని డైరెక్ట్‌గా మూవీలో రివీల్ చేస్తాడేమో.. చరణ్ మాత్రం కచ్చితంగా కనిపిస్తాడు అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ గ్లింప్స్ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది.

ఇక ఢిల్లీ, రోలెక్స్, విక్రమ్ ఈ పేర్లతో క్రియేట్ చేసిన క్యారెక్టర్లతో, ఒక్కో కథలో ఒక్కో కీలకమైన అంశంతో ఆయా పాత్రలకు ముడిపెడుతూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని ఏర్పాటు చేసి సరికొత్త ట్రెండ్‌కి తెర తీశాడు లోకేష్. ఈ పాత్రల్లో ఇప్పుడు రామ్ చరణ్ పాత్ర కూడా చేరనుంది అని సమాచారం.

అక్టోబర్ 19వ తేదీన లియో సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ‘మాస్టర్’ సినిమా తరువాత లోకేష్ తో విజయ్ చేస్తున్న రెండోవ సినిమా ఇది.