Bigg Boss Telugu OTT: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ షో చూస్తుండగానే మూడు వారాలు పూర్తి చేసుకుంది. నిన్న సండే ఫండే అంటూ నాగార్జున రావడం.. ఇంట్లోంచి మూడో వ్యక్తి ఆర్జే చైతూ కూడా ఎలిమినేట్ కావడం చకచకా జరిగిపోయాయి. అయితే, బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే మొదటి సారి ఓ వింత జరిగింది. కెప్టెన్ గా ఎన్నికైన ఓ కంటెస్టెంట్.. ఇలా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవడం ఇదే మొదటి సారి.

బయటకు వెళ్తూ వెళ్తూ ఆర్జే చైతూ ఇంటి సభ్యుల మీద తనకున్న అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా చెప్పుకుంటూ పోయాడు. ఈ క్రమంలో కలర్ ఫుల్, కలర్ ఫూల్ అంటూ నాగార్జున ఇచ్చిన టాస్క్ ను ఆర్జే చైతూ ఫినిష్ చేశాడు. ఇంతకీ, కలర్ ఫుల్ అంటే… ఇంట్లో ఉండే అర్హత ఉన్న కంటెస్టెంట్లు అని అర్ధం, అలాగే, కలర్ ఫూల్ అంటే ఇంట్లో ఉండేందుకు అర్హత లేని కంటెస్టెంట్లు అని అర్ధం.
ఆర్జే చైతూ లెక్క ప్రకారం.. కలర్ ఫుల్ కేటగిరీలో శివ, బిందు, అఖిల్, హమీద, అనిల్, అరియానా ఉన్నారు, ఇక కలర్ ఫూల్ కేటగిరీలో అజయ్, మిత్రా, స్రవంతి, అషూ, తేజులు ఉన్నారు. అయితే ఈ మొత్తం సినారియోలో యాంకర్ శివ గురించి ఆర్జే చైతూ చేసిన కామెంట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. మొదట్లో శివ అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. కారణం.. అతను చేసే కాంట్రవర్సీ ఇంటర్వ్యూలే.
కానీ, హౌస్ లోకి వచ్చిన తర్వాత శివ మీద నాకు ఉన్న ఒపీనియన్ పూర్తిగా మారిపోయింది అని చైతూ చెప్పుకొచ్చాడు. అలాగే బిందు మాధవి గురించి ఆర్జే చైతూ ఎమోషనల్ కామెంట్స్ చేస్తూ.. బిందు ఫేస్ చూసే నేను ఆ రోజును స్టార్ట్ చేస్తాను’ అని ఎమోషనల్ అయ్యాడు. అఖిల్.. నాకు బయట ఫ్రెండ్.. కానీ ఇంట్లోకి వచ్చాక మా మధ్య పెద్దగా బాండింగ్ సెట్ కాలేదు. అయినప్పటికీ అఖిల్ మనసులో నా పై మంచి అభిప్రాయమే ఉంటుంది.
హమీద గురించి చెబుతూ.. ఆమె విషయంలో నేను మొదటి నామినేషన్ లోనే.. నో వైబ్ అని చెప్పి ఆమెను నామినేట్ చేశాను. కానీ విచిత్రంగా ఆ తర్వాత క్షణం నుంచి మా ఇద్దరి మధ్య మంచి వైబ్ వచ్చింది. అప్పటి నుంచి నేను ఎక్కువగా ఆమెతోనే గడిపాను. తనకు ముక్కు మీద కోపం. ఇక అనిల్ కి ఒక సలహా ఇస్తూ నువ్వు ఇలాగే ఉండు. కామ్ గా అండ్ కంపోజ్‌గా. ఇక అరియానా, తాను ఇద్దరం స్ట్రెయిట్ ఫార్వర్డ్ అంటూ చైతూ క్లారిటీ ఇచ్చాడు.
Also Read: Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీ: ఆ కంటెస్టెంట్ ను బట్టలిప్పి బరివాత నిలబెట్టారే!
అయితే, మిగిలిన కంటెస్టెంట్ల పై ఆర్జే చైతూ చేసిన నెగిటివ్ కామెంట్స్ బాగా హీట్ పెంచాయి. ఎవరి పై ఏ నెగిటివ్ కామెంట్స్ చేశాడంటే.. అజయ్.. ఏంటో నాకు తెలుసు.. కానీ అజయ్ అంటే ఏంటో నాకు తెలియదు అంటూ అజయ్ లోని రెండు కోణాల గురించి క్లుప్తంగా చెప్పాడు. మిత్రా.. ఇంట్లో ఏం చేసింది ? అని అమాయకంగా అడిగి.. అసలు ఆమె ఆటలు కూడా ఆడలేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు.
స్రవంతి..అందరి పై నువ్వు తీసుకునే కేరింగ్ ఎక్కువైపోయింది. ఇప్పటికైనా నీ గురించి నువ్వు చూసుకో అంటూనే ముందు టాస్కులు ఆడు, కెప్టెన్ కావాలి అంటూ ఒక సలహా కూడా ఇచ్చాడు. తేజు కోపాన్ని కంట్రోల్ చేసుకో అంటూ ఆర్జే చైతూ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు.
Recommended Video: