
గ్లామర్ భామలు ఈ మధ్యకాలంలో హద్దులు మీరుతున్నారు, అడ్డు అదుపు లేకుండా వయ్యారాలను ఆరబోస్తూ మరి టూ మచ్ గా తయారవుతున్నారు. ఇలా కుర్ర హీరోయిన్లు తమ అందచందాలతో నెటిజన్లకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ షాక్ లు ఇస్తోన్న లిస్ట్ లో కుర్రభామలతో పాటు ముదురుభామలు కూడా పోటీ పడుతుండటమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గ్లామర్ విషయంలో మేమేమి తక్కువా అంటూ ముదురుభామలు కూడా కుర్ర హీరోయిన్లను మించేపోయేలా మరి రెచ్చపోతున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువగా బికినీలతో హాట్ హాట్ ఫోటో షూట్ లతో షాకిచ్చిన ముదురు భామ ఎవరైనా ఉన్నారా అంటే ‘మందిర బేడీ’నే. వయసు అయిపోయినా ఘాటు ఫోజులతో రోజురోజుకూ బోర్డ్సర్ దాటేస్తోంది. 50 ప్లస్ ల్లో కూడా కిక్కిచ్చే బికినీ లుక్కులతో రసిక హృదయాలకు నిద్రను కూడా దూరం చేస్తోంది. నిజానికి కెరీర్ ప్రారంభించనప్పడు హోమ్లీ పాత్రలతో అందగత్తెగా ఆకట్టుకున్న మందిర బేడీ, ఆ తరువాత కాలంలో సినిమాల్లో నటించి చివరకు ఇలా తయారైంది. కొన్నాళ్ళు పాటు క్రికెట్ వ్యాఖ్యాతగా కూడా పాపులర్ అయింది అనుకోండి.
ఇక ఆమెకు ఏమాత్రం గ్యాప్ దొరికినా హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ బీచ్ ల్లో తిరుగుతూ బికినీలతో సందడి చేస్తూ.. ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తనలోని గ్లామర్ షోను నేటి యువతకి కూడా పరిచయం చేస్తోంది. దీనికితోడు మందిర ఎప్పుడైతే తన ఫోటోలను పోస్ట్ చేస్తుందో వెంటనే అవి వైరల్ గా మారిపోతున్నాయి. ఇక ఈ వయసులో ఈ ఘాటు ఫోటోలు ఏమిటి ఆంటీ అంటూ కొందరు కుర్రాళ్ళు ప్రశ్నిస్తున్నా.. ఈ ముదురు భామ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోకుండా తన పని తానూ చేసుకుంటూ వెళ్ళిపోతుంది.