‘నవనీత్ కౌర్’.. పదిహేను ఏళ్ల క్రితం ఐటమ్ సాంగ్స్ కోసం తెలుగు చిన్నాచితకా డైరెక్టర్ల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయిన హాట్ అండ్ బోల్డ్ హీరోయిన్. కానీ ఇప్పుడు ప్రముఖ రాజకీయ నాయకురాలు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఈ ఒక్కప్పటి బోల్డ్ హీరోయిన్ ఎంపీగా గెలుపొందారు. కాకపోతే ప్రస్తుతం ఈ మాజీ బ్యూటీ ఎంపీ పదవి డౌట్ లో పడింది. కారణం కులం. తన కులం విషయంలో ఈ భామ ఫేక్ సర్టిఫికెట్ సమర్పించింది.
పైగా బాంబే హైకోర్టు కూడా నవనీత్ కౌర్ నిజంగానే నకిలీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించిందని తీర్పు ఇవ్వడంతో పాటు, ఆమె ధ్రువీకరణ పత్రాన్ని కూడా రద్దు చేసి, నవనీత్ కౌర్ కి షాక్ ఇచ్చింది. దీనికితోడు రూ.2 లక్షల పరిహారం కూడా విధించి ఆమెను కట్టమంది. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే నవనీత్ కౌర్ ఇండిపెండెంట్ ఎంపీగా గెలిచారు. ఈ ఘనత కచ్చితంగా ఆమె కెరీర్ లో గొప్ప రికార్డే.
అయితే, ఆమె ఎంపీగా గెలిచినా బీజేపీకి మద్దతుదారుగా ఉంటున్నారు. అందుకే, శివసేన పార్టీకి ఆమె శత్రువు అయ్యారు. నవనీత్ కౌర్’ తప్పుడు కుల ధ్రువ పత్రం సమర్పించి.. ఎంపీగా కొనసాగుతున్నారు అని శివసేన నాయకుడు కోర్టులో కేసు వేసి.. ఆమె ఎంపీ పదవికే ఎసరు పెట్టారు. బాంబే హైకోర్టు ఇదే నిజమని తేల్చి చెప్పడంతో నవనీత్ కౌర్’ ఇప్పుడు ఏమి చేస్తోందో చూడాలి.
‘నవనీత్ కౌర్’ ఎప్పటి నుండి అయితే లోక్ సభలో బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుల పై విమర్శలు చేయడం మొదలు పెట్టిందో అప్పటి నుండే ఆమెకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంతకీ ఇప్పుడు ‘నవనీత్ కౌర్’ పై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆమెతో పాటు ఆమె సన్నిహితులు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కొంతమంది తుంటరి నెటిజన్లు అయితే, ఇక ఎంపీ పదవికి రాజీనామా చేసి ఐటమ్ సాంగ్స్ చేసుకో అంటూ ‘నవనీత్ కౌర్’ను ఉద్దేశించి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.