https://oktelugu.com/

బ‌రిలో అర‌డ‌జ‌ను సినిమాలు.. మోతెక్కిపో‌నున్న థియేటర్లు!

క‌రోనా లాక్ డౌన్ త‌ర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ వేగంగా ప‌ట్టాలెక్కుతోంది. కొత్త సంవ‌త్స‌రం ఆరంభం వ‌ర‌కూ సినిమాలు రిలీజ్ చేయాలా? వ‌ద్దా? అని తేల్చుకోలేక‌పోయిన నిర్మాత‌లు.. సంక్రాంతికి ధైర్యంగా బాక్సాఫీస్ వ‌ద్ద‌కు వ‌చ్చేశారు. బ‌రిలో నిలిచిన నాలుగు సినిమాల్లో మూడు ప్ర‌భావం చూప‌లేదు. ర‌వితేజ క్రాక్ మాత్రం మిగిలిన మూడు చిత్రాల క‌లెక్ష‌న్లు కూడా కొల్ల‌గొట్టింది. త‌ద్వారా.. సినిమాలో స‌త్తా ఉంటే థియేట‌ర్ కు రావడానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని తేల్చేశారు ప్రేక్ష‌కులు. Also Read: […]

Written By:
  • Rocky
  • , Updated On : February 25, 2021 / 02:09 PM IST
    Follow us on


    క‌రోనా లాక్ డౌన్ త‌ర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ వేగంగా ప‌ట్టాలెక్కుతోంది. కొత్త సంవ‌త్స‌రం ఆరంభం వ‌ర‌కూ సినిమాలు రిలీజ్ చేయాలా? వ‌ద్దా? అని తేల్చుకోలేక‌పోయిన నిర్మాత‌లు.. సంక్రాంతికి ధైర్యంగా బాక్సాఫీస్ వ‌ద్ద‌కు వ‌చ్చేశారు. బ‌రిలో నిలిచిన నాలుగు సినిమాల్లో మూడు ప్ర‌భావం చూప‌లేదు. ర‌వితేజ క్రాక్ మాత్రం మిగిలిన మూడు చిత్రాల క‌లెక్ష‌న్లు కూడా కొల్ల‌గొట్టింది. త‌ద్వారా.. సినిమాలో స‌త్తా ఉంటే థియేట‌ర్ కు రావడానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని తేల్చేశారు ప్రేక్ష‌కులు.

    Also Read: సుకుమార్ ఫ్యామిలీతో సూపర్ స్టార్లు.. సందడే సందడి!

    ఈ విష‌యాన్ని గుర్తించిన నిర్మాత‌లు.. వ‌రుస‌గా త‌మ సినిమాల‌ను లైన్లో పెడుతున్నారు. లాస్ట్ ఫ్రైడే (ఫిబ్ర‌వ‌రి 19) ఒకే రోజు నాలుగు సినిమ‌లు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాయి. వీటిలో అల్లరి నరేష్ ‘నాంది’, అక్కినేని హీరో సుమంత్ ‘కపటధారి’తోపాటు త‌మిళ్ హీరో విశాల్ ‘చక్ర’, కన్నడ డబ్బింగ్ మూవీ ‘పొగరు’ ఉన్నాయి. ఈ నాలుగు సినిమాల్లో అల్ల‌రి న‌రేష్ నాంది మాత్ర‌మే హిట్‌ టాక్ తెచ్చుకుంది.

    అయితే.. ఈ వారం ఏకంగా అర‌డ‌జ‌ను సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో ఎన్ని సినిమాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తాయి? అన్న విష‌యం ప‌క్క‌న పెడితే.. థియేట‌ర్లు మాత్రం కొత్త పోస్ట‌ర్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడ‌డం ఖాయమనే చెప్పాలి. ప్రేక్ష‌కులు ఇంకా పూర్తిస్థాయిలో థియేట‌ర్ల‌కు రాలేదు. చాలా గ్యాప్ వ‌చ్చింది కాబ‌ట్టి.. రిలాక్సేష‌న్ కోసం థియేట‌ర్ కు వ‌స్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కాబ‌ట్టి.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు అంటున్నారు విశ్లేష‌కులు.

    ఇక‌, ఈ ఫ్రైడే రాబోతున్న సినిమాలో ప్ర‌ముఖ‌మైంది నితిన్ ‘చెక్’. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ డిఫరెంట్ కథాంశంతో వస్తోంది. ట్రైల‌ర్ ఆక‌ట్టుకోవడంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. ప్రీ-రిలీజ్ వేడుకకు వచ్చిన రాజమౌళి.. మరింత క్యూరియాసిటీ పెంచారు. అదేవిధంగా.. నితిన్ మంచి ఫామ్ లో ఉన్నాడు కాబ‌ట్టి.. మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

    Also Read: బ‌ట్టలు లేని ఫొటో అడగ్గానే.. న‌గ్న చిత్రం పెట్టేసిన శ్రీముఖి.. పిక్ వైరల్ !

    ఈ సినిమాతోపాటు అక్ష‌ర‌, అంగుళీక‌, క్ష‌ణం క్ష‌ణం, నువ్విలా నువ్విలా, ఎం.ఎం.ఓ.ఎఫ్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఇందులో అక్ష‌ర‌కే కాస్త క్రేజ్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను నందిత శ్వేత పోషిస్తున్నారు. షకలక శంకర్, అజయ్ గోష్, మధునందన్, సత్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిన్ని కృష్ణ దర్శకత్వం వహించారు. అదేవిధంగా.. సీనియర్ హీరో జేడీ చక్ర‌వ‌ర్తి న‌టించిన హార‌ర్ మూవీ ఎం.ఎం.ఓ.ఎఫ్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి, వీటిల్లో ఏ సినిమా సత్తా చాటుతుందో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    Tags