Guess Actor: ఈ క్రమంలో ఎంతో మంది ముద్దుగుమ్మలు సినిమా ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వాళ్ళ అందం, అభినయంతోపాటు ఆవగింజ అంతా అదృష్టం కలిసి వస్తే సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాల పాటు వాళ్లకు అవకాశాలు క్యూ కడతాయి. ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలలో సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి క్యూట్ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. సినిమా తారాలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలను చూడడానికి అభిమానులు కూడా బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా సెలబ్రిటీల పుట్టినరోజు సందర్భంగా లేదా ప్రత్యేక సందర్భాలలో వాళ్లకు సంబంధించిన పాత ఫోటోలు నెట్టింట్లొ సందడి చేస్తాయి. కోలీవుడ్, టాలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ ఇలా ఏ సినిమా ఇండస్ట్రీ అయిన కూడా ఆ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల ఫోటోలు సామాజిక మాధ్యమాలలో కనిపిస్తూనే ఉంటాయి. రీసెంట్ గా ఒక క్రేజీ హీరోయిన్ చిన్ననాటి క్యూట్ ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాలలో అందరిని తెగ ఆకట్టుకుంటుంది.
Also Read: నిరుడు విభేదాలు.. మైదానంలోనే కొట్లాటలు.. ఏడాదిలోనే ముంబై ఇండియన్స్ ఇలా ఎలా మారింది?
ప్రస్తుతం ఈమె తెలుగులో స్టార్ హీరోయిన్. తెలుగు తో పాటు ఈ బ్యూటీ తమిళ్, మలయాళం, హిందీ భాషలలో కూడా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలిచింది. ఈ మధ్యకాలంలో ఒక టాలీవుడ్ స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది ఈ బ్యూటీ. ఈ బ్యూటీ మరెవరో కాదు పొన్నియన్ సెల్వాన్ సినిమాలో వనితగా ప్రేక్షకులకు బాగా దగ్గరయినా హీరోయిన్ శోభిత ధూళిపాల. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఈమె వరుస అవకాశాలు అందుకొని తన అందంతో, అభినయంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. హిందీ సినిమాతో శోభిత ధూళిపాల సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా నటించిన రామన్ రాఘవ్ 2.0 అనే సినిమాతో శోభిత ధూళిపాల హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది.
అడవి శేష్ గూడచారి సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది శోభిత. అలాగే శోభిత ధూళిపాల గోస్ట్ స్టోరీస్, కురుప్, మేజర్, పొన్నీయన్ సెలవన్ సిరీస్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అక్కినేని హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి గత ఏడాది డిసెంబర్ లో పెళ్లి కూడా చేసుకుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వీరిద్దరూ లవ్లీ జంటగా పేరు తెచ్చుకున్నారు. శోభిత ధూళిపాల సామాజిక మాధ్యమాలలో చాలా యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. మరోవైపు అక్కినేని నాగచైతన్య కూడా రీసెంట్ గా తండెల్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
View this post on Instagram