
Photo Story: ప్రేక్షకులకు సెలెబ్రిటీల గురించి ఎన్నో విషయాలను తెలుసుకోవాలని ఉంటుంది.వాళ్లకి సంబంధించిన వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి వీళ్ళు అమితాసక్తిని చూపిస్తూ ఉంటారు.సెలెబ్రెటీలకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు మరియు వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకుంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటారు.అలా రీసెంట్ ఒక హాట్ బ్యూటీ కి సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి.
ఆ ఫోటో ని చూసి ఈ ఎవరీ చిన్నపాప ఇంత క్యూట్ గా ఉందీ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.క్రింద కనిపిస్తున్న ఫోటో మరెవరిదో కాదు, మిస్ యూనివర్స్ గా కిరీటం గెలుచుకున్న ‘ఊర్వశి రౌటేలా’.ఈమె రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘బాస్ పార్టీ’ సాంగ్ లో చిరంజీవి తో కలిసి ఆడిపాడింది.అంత తేలికగా ఎవరు మర్చిపోగలరు ఈమెని.మోడలింగ్ రంగం లో దిగ్గజం గా పేరు తెచ్చుకున్న ఊర్వశీ ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఒక ఒక్క సినిమాలు చేస్తూనే మరో పక్క మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొనేది ఊర్వశి.అలా 2015 వ సంవత్సరానికి గాను ఆమె మిస్ యూనివర్స్ టైటిల్ ని గెల్చుకుంది.2013 వ సంవత్సరం లోనే వెండితెర అరంగేట్రం చేసిన ఈమె, ఆ తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని 2015 వ సంవత్సరం నుండి సినీ రంగ కెరీర్ ని గ్రాండ్ గా ఆరంభించింది.తొలి సినిమాతోనే కన్నడ స్టార్ హీరో దర్శన్ పక్కన నటించే అవకాశం ని గెల్చుకుంది ఊర్వశి.ఆ తర్వాత హిందీ లో ‘సనమ్ రే’ సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది.
వరుసగా హిందీ సినిమాలు చేస్తూనే మరో పక్క స్పెషల్ ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ ఉండేది ఊర్వశీ.ప్రస్తుతం ఈమె రామ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది.ఈ సినిమాతో పాటు పలు హిందీ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ ఫుల్ బిజీ గా ఉంది ఊర్వశీ.ఆమెకి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు కొన్ని ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాము చూడండి.