https://oktelugu.com/

Heroine Shobhana : హీరోయిన్ శోభన పక్కన ఉన్న ఈ బ్యూటీ ఓ స్టార్ హీరో వైఫ్… గుర్తు పట్టారా?

అనంతరం 2000లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. షాలిని నటించిన చెలి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

Written By:
  • NARESH
  • , Updated On : February 14, 2024 / 07:55 PM IST
    Follow us on

    Heroine Shobhana : ఓ స్టార్ హీరో ఓల్డ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరోయిన్ శోభన పక్కన ఆమె ఉన్నారు. కొందరు ఆమె ఎవరో? ఏ హీరో భార్యనో గుర్తిస్తుండగా… కొందరు ఎవరా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. శోభన 80లలో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. భరత నాట్యంలో ప్రొఫెషనల్ అయిన శోభన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆమె చాలా సెలెక్టివ్ గా చిత్రాలు చేస్తున్నారు. 2020లో ఓ మలయాళ చిత్రం చేసిన శోభన మరలా సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు.

    ఆమె డాన్స్ స్కూల్ నడుపుతున్నట్లు సమాచారం. శోభన వివాహం చేసుకోలేదు. ఇక శోభన పక్కన ఉన్న ఆ యువతి షాలిని. కోలీవుడ్ స్టార్ అజిత్ భార్య. షామిలి చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. షాలిని, శోభన ఓ సినిమా సెట్స్ లో దిగిన ఫోటో వైరల్ గా మారింది. షాలిని-అజిత్ కలిసి అమరకాలం టైటిల్ తో ఒక చిత్రం చేశారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు.

    అనంతరం 2000లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. షాలిని నటించిన చెలి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చెలి తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం అందుకుంది. అజిత్ తో వివాహం అనంతరం ఆమె నటనకు దూరమయ్యారు. ఇక షాలిని భర్త అజిత్ కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా వెలుగొందుతున్నాడు. అజిత్ కి తెలుగులో కూడా మార్కెట్ ఉంది.

    అజిత్ రియల్ హీరో. బైక్ రేసుల్లో పాల్గొనడం ఇష్టమైన వ్యాపకం. సాహసాలు చేసేందుకు ఇష్టపడతారు. ఈ క్రమంలో ఆయన గాయాలపాలైన సందర్భాలు ఉన్నాయి. అజిత్ గత చిత్రాలు వలిమై, తునివు తెలుగులో కూడా చెప్పుకోదగ్గ ఆదరణ దక్కించుకున్నాయి. ప్రస్తుతం విడా ముయార్చి చిత్రంలో నటిస్తున్నారు. మాగిజ్ తిరుమేని దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.