Photo Story: సినీ ఇండస్ట్రీలో ఇటీవల కొత్త హీరోయిన్ల హవా పెరిగిపోతుంది. తమిళం, మలయాళం పరిశ్రమల్లో గుర్తింపు పొందిన వారు తెలుగులోనూ తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో టాలీవుడ్ నుంచి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు. అలాంటి ఓ హీరోయిన్ ఒకటి, రెండు సినిమాల్లో మాత్రమే నటించి ఫేమస్ అయింది. తెలుగులో పాపులారిటీ వచ్చిన తరువాత ఆమెకు ఇతర ఇండస్ట్రీల నుంచి మరిన్ని అవకాశాలు పెరిగి.. సౌత్ లెవల్లో స్టార్ గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే ఆమె చిన్ననాటి పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఆ చిన్నారి ఎవరో కాదు సంయుక్త మీనన్. ఈ బ్యూటీ కేరళ కు చెందిన అమ్మాయి. పాలక్కడ్ లో 1995 సెప్టెంబర్ 11న జన్మించిన సంయుక్త ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆ తరువాత సినిమాలపై ఇంట్రెస్టు కలిగిన ఈ మె 2016లో మలయాళ చిత్రం పాప్ కార్న్ లో మొదటిసారిగా నటించింది. ఆ తరువాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. తమిళ ఇండస్ట్రీలోనూ పలు సినిమాల్లో నటించిన సంయుక్త కల్యాణ్ రామ్ నటించిన బింబిసార తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
ఆ తరువాత బీమ్లానాయక్ సినిమాలో రానా భార్యగా నటించి ఆకట్టుకుంది. రీసెంట్ గా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి విరూపాక్ష సినిమాలో సంయుక్త నటనకు అంతా పిదా అయ్యారు. మిగతా హీరోయిన్ల కంటే సంయుక్త ఇప్పుు బిజీ హీరోయిన్ అని చెప్ప వచ్చు. తమిళ హీరో ధనుష్ తో కలిసి సార్ సినిమాతో ఆమెకు సౌత్ లెవల్లో గుర్తింపు వచ్చింది. దీంతో చాలా మంది నిర్మాతలో సంయుక్తను తమ సినిమాలో హీరోయిన్ కోసం ఎంపిక చేసుకుంటున్నారు.
సంయుక్త మీనన్ సినిమాల్లో సాంప్రదాయంగా కనిపిస్తారు. మరోవైపు హాట్ హాట్ డ్రెస్సుల్లోనూ యూత్ ను ఆకట్టుకుంటున్నారు. దీంతో ఆమెకు యూత్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. సోషల్ మీడియాలో సంయుక్త పిక్స్ ట్రెండీగా నిలుస్తూ ఉంటాయి. లేటేస్టుగా ఆమె పవన్ కల్యాణ్ ‘బ్రో’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన కొద్దిరోజుల్లోనే స్టార్ గుర్తింపు రావడంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.