Tollywood Actor : కొంతమందికి సినిమాలంటే మామూలు పిచ్చి ఉండదు. చిన్నప్పటి నుండి తమ అభిమాన హీరోలను, హీరోయిన్లను చూసి తాము కూడా అలా వెండితెర పై కనిపించాలని తాపత్రయం పడుతుంటారు. కొంతమంది ఆర్ధిక స్తొమత ని అర్థం చేసుకొని టాలెంట్ ఉన్నప్పటికీ కూడా సినిమాల్లోకి వెళ్లే ఆలోచనలను విరమించుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అయితే లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలను సైతం వదిలేసి సినిమాల్లోకి వస్తుంటారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు కూడా అలాంటోడే. ఆరోజుల్లో ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక వరం లాగా భావించవచ్చు. రిటైర్ అయ్యాక కూడా డబ్బులు కూర్చొని సంపాదించొచ్చు. అలాంటి ఉద్యోగాన్ని వదిలి ఆయన సినీ రంగంలోకి వచ్చి రిస్క్ చేసి సక్సెస్ అయ్యాడు. నేటి తరం లో కూడా ఉద్యోగాలు వదిలేసి సినిమాల మీద అతి మోజుతో ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు.
అలాంటి వారిలో ఒకరి గురించే నేడు మనం మాట్లాడుకోబోతున్నాము. అతని పేరు వడ్లమని శ్రీనివాస్. ఇతను పేరు చెప్తే ఎవ్వరూ గుర్తు పట్టలేరు, కానీ ముఖాన్ని చూస్తే ప్రతీ ఒక్కరు గుర్తుపట్టగలరు. చాలా కాలం నుండి అనేక సినిమాల్లో క్యారక్టర్ రోల్స్ ద్వారా మనకి కనిపిస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రం లో ఇంటర్వెల్ సన్నివేశం లో హీరో మంత్రి ఇంటికి బైక్ మీద దూసుకొస్తున్న సమయంలో అతన్ని అడ్డుకునే పోలీస్ ఆఫీసర్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆయనే శ్రీనివాస్. ‘వకీల్ సాబ్’ చిత్రం తో పాటు ఈయన ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’, ‘డియర్ కామ్రేడ్’, ‘బేబీ’, ‘మైఖేల్’,’పాగల్’ ఇలా ఒక్కటా రెండా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ దొరికాయి. ఫుల్ లెంగ్త్ రోల్స్ చేసే అవకాశం రాకపోయినా, తనకి దక్కిన స్కోప్ లో తనదైన టైమింగ్, ఆహార్యం చూపించేవాడు.
అయితే ఈయన సినిమాల్లోకి రాకముందు ఆషామాషీ మనిషి కాదు. విజయవాడ కి జాయింట్ కలెక్టర్ గా పని చేశాడు. కలెక్టర్ గా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేత కూడా ప్రశంసలు అందుకున్నాడు. అలాగే ఆయన జాయింట్ కలెక్టర్ ఉద్యోగాన్ని కొనసాగించి ఉండుంటే నేడు గొప్ప క్యాడర్ లో స్పెషల్ ఆఫీసర్ గా ఉండేవాడు. జాయింట్ కలెక్టర్ గా పని చేస్తున్న రోజుల్లో శ్రీనివాస్ నెలకు లక్ష రూపాయిలు జీతం అందుకునేవాడు. సినిమాల మీద పిచ్చి వ్యామోహం, ఇష్టం తో తన ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా అవకాశాల వేట కొనసాగించాడు. ప్రభుత్వం నుండి కాస్త పలుకుబడి ఉండడంతో ఈయనకు సినిమా అవకాశాల కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. సినిమా అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ, ప్రేక్షకులు ఇప్పటికే మర్చిపోలేని ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ కోసం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నాడు. మరి ఆయన ఎదురు చూపులకు తెరదించే డైరెక్టర్ ఎవరో చూడాలి.