Vijay Deverakonda: లైగర్ సినిమా పరాజయం తర్వాత విజయ్ దేవరకొండ మీద విపరీతమైన ట్రోల్స్ నడిచాయి. ముఖ్యంగా సోషల్ మీడియా లో హద్దే లేకుండా సాగాయి. దీనితో కొన్ని రోజులు మీడియాకు దూరంగా ఉండిపోయారు విజయ్. ఈ రౌడీ బాయ్ కి ఖచ్చితంగా హిట్ కావలసిన సమయంలో వచ్చింది ఖుషి. ఒక రకంగా చెప్పాలంటే విజయ్ కెరీర్ కి ఈ సినిమా చాలా అవసరం. దీనితో ఖుషి మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు విజయ్.
దానికి తగ్గట్లే సినిమాకు డీసెంట్ హిట్ టాక్ వచ్చి, కేవలం మూడు రోజుల్లో దాదాపు 70 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి దూసుకువెళుతుంది ఈ సినిమా. దీనితో వైజాగ్ లో ఖుషి విజయోత్సవ ఈవెంట్ జరిగింది. దీనికి హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ కొన్ని హాట్ హాట్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక రకమైన చర్చకు దారితీశాయి విజయ్ చేసిన వ్యాఖ్యలు .
తన మీద, తన నుండి వస్తున్న సినిమాల మీద దాడులు జరుగుతున్నాయని, కొందరు కావాలని డబ్బులిచ్చి మరి మా సినిమాపై నెగిటివిటీ తీసుకు వస్తున్నారని, అందులో భాగంగా ఎన్నో ఫేక్ రివ్యూస్ వచ్చాయని, మరి ముఖ్యంగా యూట్యూబ్ ఫేక్ రివ్యూస్ ను దాటుకొని మరి ఖుషి సినిమా ఇంతటి సక్సెస్ అయ్యిందంటే అందుకు కారణం నా అభిమానులుగా ఉన్న మీ ప్రేమే కారణం. మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడి నిరుత్సహ పరచాలని నాకు లేదు. వాటి గురించి మరో రోజు మాట్లాడుకుందాం అంటూ చెప్పుకొచ్చాడు విజయ్.
ఇదే సమయంలో తన రెమ్యునరేషన్ నుండి కోటి రూపాయలతో ఒక వంద కుటుంబాలకు సాయం చేయబోతున్నట్లు ప్రకటించాడు విజయ్. డబ్బు సంపాదించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, అమ్మ నాన్నలను బాగా చూసుకోవాలని అనుకునేవాడిని కానీ ఇక నుంచి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్న, మీ కోసం పనిచేయాలని అనుకుంటున్నా, నా విజయంలో మీ పాత్ర చాలా ఉంది. అందుకే నా సంపాదనలో కూడా మీకు వాటా ఉండాలని అనుకుంటున్నా అంటూ తెలిపారు విజయ్ దేవరకొండ.