https://oktelugu.com/

Engineering: ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు వీళ్లే..!

Engineering: చదువు సంధ్యలేకుండా ఖాళీగా ఉండేవాళ్లే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణిస్తారనే రూమర్స్ సినిమావాళ్లపై ఎప్పటి నుంచో ఉన్నాయి. గతంలో చాలామంది నటీనటులు పెద్దగా చదువుకోకుండానే స్టార్డమ్ సంపాదించుకోని కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. దీంతో వారిని ఓర్వలేని కొంతమంది ఇలాంటి రూమర్స్ ను బాగా స్ప్రెడ్ చేసి ఇండస్ట్రీలోకి  విద్యావంతులు రాకుండా చేసే ప్రయత్నం చేశారు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నత చదువులు చదివిన వాళ్లు ఉన్నారు. డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత […]

Written By:
  • NARESH
  • , Updated On : December 6, 2021 / 11:04 AM IST
    Follow us on

    Engineering: చదువు సంధ్యలేకుండా ఖాళీగా ఉండేవాళ్లే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణిస్తారనే రూమర్స్ సినిమావాళ్లపై ఎప్పటి నుంచో ఉన్నాయి. గతంలో చాలామంది నటీనటులు పెద్దగా చదువుకోకుండానే స్టార్డమ్ సంపాదించుకోని కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. దీంతో వారిని ఓర్వలేని కొంతమంది ఇలాంటి రూమర్స్ ను బాగా స్ప్రెడ్ చేసి ఇండస్ట్రీలోకి  విద్యావంతులు రాకుండా చేసే ప్రయత్నం చేశారు.

    Nagarjuna

    నిజానికి సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నత చదువులు చదివిన వాళ్లు ఉన్నారు. డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు చదివినవాళ్లు ఉన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలను కొంతకాలం చేసి సినిమాపై ఫ్యాషన్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినవాళ్లు ఉన్నారు. అలాంటి వారిలో హీరోలే కుండా దర్శకులు సైతం ఉండటం విశేషం.

    టాలీవుడ్ తోపాటు సౌత్ ఇండియాలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సినిమా రంగంలోకి వచ్చిన వాళ్ల లిస్టును ఒకసారి పరిశీలిస్తే.. వారిలో చాలామంది ప్రస్తుతం టాప్ పోజిషన్లో ఉన్నవారే కన్పిస్తున్నారు. వీరిలో ముందు వరుసలో కింగ్ నాగర్జున పేరు చెప్పుకోవాలి. ఆయన విదేశాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఏఎన్నాఆర్ నటవారసుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు.

    Sekhar Kammula

    దర్శకుడు శేఖర్ కమ్ముల సాప్ట్ వేర్ ఇంజనీరింగ్ చేసి కొన్నాళ్లు అమెరికాలో ఉద్యోగం చేశారు. సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో ఆయన సొంతంగా దర్శకత్వం చేసి వరుస విజయాలతో దూసుకెళుతున్నారు. మంచి కాఫీలాంటి సినిమాలను తీయడంలో శేఖర్ కమ్ముల దిట్ట. తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ సైతం ఇంజనీరింగ్ చేశారు. అందుకే కాబోలు ఈయన కథలన్నీ కూడా ఎక్కువగా కాలేజీల చుట్టూ తిరుగుతూనే ఉంటాయి.

    Karthi

    తమిళ హీరో కార్తీ కూడా ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినవారే. కొన్నాళ్లు మణిరత్నం దగ్గర శిష్యరికం చేసిన కార్తీ ఆ తర్వాత ‘యుగాంతం’ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రోటిన్ కు భిన్నంగా ఉండే కథలను తెరకెక్కించే సెల్వరాఘవన్ యూనివర్సిటీలో బ్రిలియంట్ స్టూడెంటే. దర్శకుడు దేవకట్టా మెకానిక్ ఇంజనీరింగ్ చేసిన కొన్నాళ్లు జాబ్ చేశారు. ఆ తర్వాతి దర్శకుడిగా మారాడు.

    Tarun Bhaskar

    Also Read: Ramarao On Duty: రవితేజ ”రామారావు ఆన్ డ్యూటీ” విడుదల తేదీ ఖరారు…

    ‘పెళ్లిచూపులు’ మూవీకి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ ది సైతం మెకానికల్ బ్రాక్ గౌండే. ఆయన దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా రాణిస్తున్నారు. అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర బీటెక్ చేశాడు. శ్రీనివాస అవసరాల అమెరికాలో సాప్ట్ వేర్ ఇంజనీరింగ్ గా చేశారు. అష్టచమ్మాతో నటుడిగా పరిచయం అయినా దర్శకుడిగా కూడా మంచి మార్కులు తెచ్చుకున్నారు.

    Also Read: Tollywood Actors: తెలుగు హీరోలను జస్టిస్ ఎన్వీ రమణ అంత మాటన్నాడా..?