Star Directors: సినిమా డైరెక్టర్ ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్ లో ప్రావీణ్యం ఉన్నవాడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అవుతాడు. ఎప్పుడూ కెమెరా వెనకుండి ఆదేశాలిచ్చే డైరెక్టర్స్ కి తెరపై తళుక్కున మెరవాలన్న ఆశ ఉంటుంది. ఆ కోరికను దర్శకులు తమ చిత్రాల ద్వారానో.. ఇతర దర్శకుల చిత్రాలలో నిజ జీవిత పాత్రలలోనో నటించి తీర్చుకుంటారు.మరి రాజమౌళి నుండి రాఘవేంద్రరావు వరకు నటులుగా మారిన దర్శకులెవరో చూడండి.

ఈ విషయంలో లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు అగ్రగణ్యులు. వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణ నటుడిగా యాభైకి పైగా చిత్రాలు చేశారు.అందులో ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రాలు కూడా ఉన్నాయి. కామెడీ, సెంటిమెంట్, సీరియస్ ఇలా అన్ని రకాల పాత్రలు చేశారు. ఆయన కీలక రోల్స్ లో నటించిన మామగారు, ఒసేయ్ రాములమ్మ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నాయి.
మౌన ముని కె రాఘవేంద్రరావు కూడా వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. 50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో ఆయన ముఖానికి రంగు వేసుకోలేదు. ఇటీవల విడుదలైన పెళ్లి సందడి చిత్రంలో ఆయన నటించడం విశేషం.
కళాతపస్వి కె విశ్వనాథ్ అజరామరమైన చిత్రాలను తెరకెక్కించడమే కాకుండా పూర్తి స్థాయి నటుడుగా పలు చిత్రాల్లో నటించారు. ఈ జనరేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్స్ నరసింహనాయుడు, కలిసుందాం రా చిత్రాలలో ఆయన కీలక రోల్స్ చేశారు. దాసరి మాదిరి పదుల సంఖ్యలో నటుడిగా చిత్రాలు చేశారు.
Also Read: ఆ స్టార్ల పరిస్థితి ఏమిటి ? పగకు బలి కావాల్సిందేనా ?
దర్శక ధీరుడు రాజమౌళికి కూడా ఈ పిచ్చి ఉంది. పూర్తి స్థాయిలో ఆయన పాత్రలు చేయకున్నా, క్యామియో రోల్స్ చేశారు. నాని నటించిన మజ్ను, బాహుబలి 2 వంటి చిత్రాలలో రాజమౌళి నటించారు.
మరో స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ సైతం తన యాక్టింగ్ టాలెంట్ చూపించాడు. ఆయన దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఠాగూర్ మూవీలో ఆయన చిన్న పాత్ర చేశారు.
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా కెమెరా ముందుకు వచ్చారు. ఏమాయ చేశావే, బిజినెస్ మాన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ సినిమాలలో ఆయన క్యామియో రోల్స్ చేశారు. ఈ డైరెక్టర్స్ కేవలం ఉదాహరణకు మాత్రమే, నటులుగా మారిన దర్శకులు పరిశ్రమలో ఎందరో ఉన్నారు.