https://oktelugu.com/

Tollywood : మన స్టార్ హీరోల సినిమాల్లో ఈ హీరోయిన్లు అసలు సెట్ అవ్వలేదు…

మహేష్ బాబు హీరోగా వచ్చిన రాజకుమారుడు సినిమాలో ప్రీతిజింటా హీరోయిన్ గా నటించింది. అయితే ఈమె ఏజ్ పరంగా మహేష్ బాబు కంటే పెద్దది అయినప్పటికీ ఈ సినిమాలో కూడా మహేష్ కి జోడిగా నటించడంలో కొంతవరకు ఫెయిల్ అయింది. ఆమెను చూసిన ప్రతి ఒక్కరు మహేష్ బాబుకి అక్క లాగా ఉంది అని కామెంట్లైతే చేశారు...

Written By:
  • NARESH
  • , Updated On : March 13, 2024 10:52 am
    Follow us on

    Tollywood : సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని తమ ఫ్యాన్స్ లో విపరీతమైన అభిమానాన్ని సంపాదించుకుంటు ముందుకు సాగుతున్నారు…సీనియర్ ఎన్టీయార్ దగ్గర్నుంచి ఇప్పుడు యంగ్ జనరేషన్ లో వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరు కూడా తమ దైన రీతిలో సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే సినిమాల్లో మన హీరోలకి జోడీలుగా నటించిన హీరోయిన్లు ఆయా సినిమాలో వాళ్ళకి అస్సలు సెట్ అవ్వలేదు. కొంతమంది అయితే మన హీరోలకి అక్క లాగా కనిపించారు. ఆ హీరోయిన్లు ఎవరు ఆ సినిమాలేంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    మహేష్ బాబు హీరోగా వచ్చిన రాజకుమారుడు సినిమాలో ప్రీతిజింటా హీరోయిన్ గా నటించింది. అయితే ఈమె ఏజ్ పరంగా మహేష్ బాబు కంటే పెద్దది అయినప్పటికీ ఈ సినిమాలో కూడా మహేష్ కి జోడిగా నటించడంలో కొంతవరకు ఫెయిల్ అయింది. ఆమెను చూసిన ప్రతి ఒక్కరు మహేష్ బాబుకి అక్క లాగా ఉంది అని కామెంట్లైతే చేశారు…

    అలాగే త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఖలేజా సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అనుష్క కూడా మహేష్ బాబుకి అక్క లాగా ఉందని చాలా విమర్శలైతే వచ్చాయి. ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు…నిజానికి మహేష్ బాబు చాలా క్యూట్ గా ఉంటాడు. కాబట్టి అతనికి కొంచెం సన్నగా, స్లిమ్ గా ఉండే హీరోయిన్లైతేనే సెట్ అవుతారు. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు కనిపిస్తే మాత్రం అతనికి అక్క లాగా ఉంటారని చాలామంది విమర్శలను కూడా చేస్తూ ఉంటారు…

    జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దమ్ము సినిమాలో హీరోయిన్ త్రిష అలాగే కార్తీక ఇద్దరు హీరోయిన్లు గా నటించారు. వీళ్ళిద్దరూ కూడా ఎన్టీఆర్ కి ఏ మాత్రం సెట్ అవలేదు. కార్తీక కొంచెం బొద్దుగా, హైట్ గా ఉండడంతో ఎన్టీఆర్ కంటే పెద్దావిడ లా కనిపించిందనే కొన్ని విమర్శలైతే వచ్చాయి. అయితే దమ్ము సినిమా ఫ్లాప్ లో ఇది కూడా ఒక మెయిన్ రీజన్ గా పరిగణించవచ్చు…