TOP 5 Movies : ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటుతూ ప్రభాస్ సలార్ సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాడు… ఇక ఈ సినిమాతో పాటు గా ఈ నెలలో రిలీజ్ అయి మంచి వసూళ్ళను సాధిస్తున్న సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం…
సలార్
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరో గా వచ్చిన సలార్ సినిమా ఇప్పటికే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ఈ సినిమా 3 రోజుల్లోనే 400 కోట్ల కలక్షన్లను వసూలు చేసింది. ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో 1000 కోట్లకు పైన వసూళ్లను కలెక్ట్ చేస్తుంది అనే టాక్ అయితే వినిపిస్తుంది.
డంకి
షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో వచ్చిన డంకి సినిమా రిలీజ్ కి ముందు ఈ సినిమా మీద ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉండేవి. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాని చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. ఇక దాంతో ఈ సినిమా 4 రోజుల్లోనే 156 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది…
అనిమల్
రణ్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి వసుళ్లను రాబట్టింది. ఇప్పటివరకు 25 రోజులు అవుతున్న కూడా ఈ సినిమా 24 రోజులకి 860 కోట్ల పైన కలక్షన్లను రాబట్టింది.ఇక ఈ సినిమా 1000 కోట్ల కలక్షన్స్ ని ఈజీగా రాబడుతుంది అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు…
ఆక్వా మ్యాన్ లాస్ట్ కింగ్ డమ్
ఈ సినిమా కూడా డంకి, సలార్ లతో పోటీపడి కొంత మేరకు ఈ సినిమాకి కూడా మంచి వసూళ్లను రాబట్టింది.ఇక సలార్ సినిమా డామినేషన్ తో ప్రేక్షకులు ఈ సినిమాని చూడటానికి పెద్దగా ఇష్టపడడం లేదు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని సక్సెస్ ఫుల్ సినిమా గా రన్ అవుతున్న క్రమంలో ఈ సినిమా కలక్షన్స్ పైన సలార్ ప్రభావం చాలా పెద్ద గా పడుతున్నట్టుగా తెలుస్తుంది…
హాయ్ నాన్న
నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న సినిమా ఎమోషనల్ డ్రామా తెరకెక్కింది. ఇక ఈ సినిమాతో నాని మరొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా ఇప్పటివరకు 65 కోట్ల కలెక్షన్లను రాబట్టింది…