https://oktelugu.com/

Book my show : ఈ ఏడాది ‘బుక్ మై షో’ యాప్ లో అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన టాప్ 5 చిత్రాలు ఇవే..’పుష్ప 2′ ఏ స్థానంలో ఉందంటే!

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో బుక్ మై షో యాప్ ద్వారా అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన టాప్ 5 సినిమాలేంటో ఒకసారి చూద్దాం.

Written By:
  • Vicky
  • , Updated On : December 6, 2024 / 10:06 PM IST

    Sold the most tickets In Book My Show

    Follow us on

    Book my show : ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ కి గోల్డెన్ ఇయర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకటి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలు తప్పినప్పటికీ, భారీ ఆశలు పెట్టుకున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లనే రాబట్టింది. సూర్య ‘కంగువా’ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యుంటే బాగుండేది. కానీ టాలీవుడ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లాల్సిన సినిమాలైనా ‘కల్కి’, ‘దేవర’, ‘పుష్ప 2: ది రూల్’ చిత్రాలు మాత్రం అంచనాలు తప్పలేదు. ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ఇదంతా పక్కన పెడితే ఈ ఏడాది విడుదలైన సినిమాలలో బుక్ మై షో యాప్ ద్వారా అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన టాప్ 5 సినిమాలేంటో ఒకసారి చూద్దాం.

    కల్కి 2898 AD :

    ప్రభాస్, నాగ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి కోటి 30 లక్షల టిక్కెట్లు బుక్ మై షో ద్వారా అమ్ముడుపోయాయి.

    స్త్రీ 2 :

    2018 వ సంవత్సరం లో విడుదలైన ‘స్త్రీ’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం, బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామీని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా, కేవలం హిందీ వెర్షన్ లో 900 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టడం మామూలు విషయం కాదు. చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇలాంటివి జరగడం కాస్త కష్టమే. ఈ సినిమాకి బుక్ మై షో యాప్ ద్వారా కోటి 11 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

    పుష్ప 2 : ది రూల్(రన్నింగ్):

    నిన్న విడుదలైన ఈ సినిమా అన్ని ప్రాంతీయ భాషల్లోనూ సునామీ లాంటి ఓపెనింగ్ వసూళ్లను రాబట్టింది. మొదటి రోజే 274 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి, ప్రస్తుతం బుక్ మై షోలో గంటకు లక్ష టికెట్స్ కి పైగా అమ్ముడుపోతున్నాయి. ఇది సాధారణమైన ట్రెండ్ కాదు. రెండవ రోజు కూడా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేయడంతో, ఈ సినిమాకి కేవలం రెండు రోజుల్లోనే బుక్ మై షో ద్వారా 50 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయని అంచనా వేస్తున్నారు.

    అమరన్ :

    శివ కార్తికేయన్, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం సైలెంట్ హిట్ గా నిల్చింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి 49 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయట. హిందీ లో విడుదల లేకపోయినప్పటికీ కూడా ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు.

    దేవర:

    సుమారుగా ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరో గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. మొదటి రోజు కాస్త డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, రెండవ రోజు నుండి టాక్ మెరుగుపర్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి, బుక్ మై షో యాప్ లో 48 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయని సమాచారం.