Top 10 movies: జాతీయ స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల్లోని పులివెందుల నియోజకవర్గం ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మాజీ సీఎం జగన్ కారణంగా ఈ ప్రాంతానికి మంచి పేరొచ్చింది. రాజకీయంగా ఇది జగన్ అడ్డా, YSR కుటుంబం అడ్డా, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ సినిమాల పరంగా ఇక్కడ మెగా ఫ్యామిలీ హీరోలు చాలా స్ట్రాంగ్. ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో టాప్ 10 మూవీస్ లిస్ట్ తీస్తే అందులో ఆరు సినిమాలు మెగా హీరోలవే ఉంటాయి. ఒక్కసారి ఆ టాప్ 10 సినిమాల లిస్ట్ ఒకసారి చూద్దాం. మొదటి స్థానం లో ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన #RRR చిత్రం ఉన్నది. ఈ సినిమాకు దాదాపుగా 76.98 లక్షల రూపాయిలు వచ్చాయి. ఇక ఆ తర్వాత రెండవ స్థానం లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం ఉన్నది. ఈ చిత్రానికి దాదాపుగా 58.72 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఆ తర్వాత మూడవ స్థానం లో జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రం కొనసాగుతుంది. ఈ చిత్రానికి 43.95 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రికార్డు ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి 40.73 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పటికే డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకెళ్తోంది. కాబట్టి ఫుల్ రన్ లో దేవర ని దాటి నాల్గవ స్థానం నుండి మూడవ స్థానంలోకి వెళ్లొచ్చు. ఇక 5వ స్థానం లో ‘బాహుబలి 2’ చిత్రం 38.71 లక్షల రూపాయలతో కొనసాగుతుండగా, 6వ స్థానంలో కల్కి చిత్రం 37.60 లక్షల రూపాయిల గ్రాస్ తో కొనసాగుతోంది.
ఇక గత ఏడాది విడుదలైన విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం 32.88 లక్షల రూపాయలతో 7వ స్థానం లో కొనసాగుతుండగా, 16 ఏళ్ళ క్రితం విడుదలైన ‘మగధీర’ చిత్రం 32.72 లక్షల రూపాయలతో 8వ స్థానం లో కొనసాగుతోంది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం 32.71 లక్షల రూపాయలతో 9వ స్థానం లో కొనసాగుతుండగా, అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రం 32.67 లక్షల రూపాయలతో 10 వ స్థానంలో కొనసాగుతుంది. మొత్తం మీద టాప్ 10 మెగా ఫ్యామిలీ హీరోల్లో అల్లు అర్జున్ , చిరంజీవి, రామ్ చరణ్ చెరో రెండు సినిమాలతో కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం గత ఏడాది విడుదలై 30 లక్షల రూపాయిలు రాబట్టింది. ఓపెనింగ్స్ లో ప్రస్తుతం ఓజీ చిత్రమే టాప్ లో ఉంది. లాంగ్ రన్ లో ఇక్కడ పవన్ కాస్త వెనకబడ్డాడు.