Tollywood Couples: విడాకులు అనే కాన్స్పెక్ట్ సినిమా వాళ్ళల్లో చాలా సహజమైన అంశం అని బయట రూమర్ ఉంది. టాలీవుడ్ లోనే కాదు, అటు బాలీవుడ్ లోనూ ఈ విడాకుల వ్యవహారం చాలా కామన్. భర్త లేదా భార్య నచ్చకపోతే విడిపోవడమే మంచిదని సినిమా వాళ్ళు నమ్ముతారు. అయితే.. కొన్ని జంటలు మాత్రం అసలు విడాకులే తీసుకోకుండా విడివిడిగా ఉంటున్నారు. అసలు వీళ్ళ మధ్య బంధం ఉందా ? లేదా ? అని ప్రపంచానికి కూడా తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇంతకీ ఈ జంటలు ఎవరో చూడండి.
శ్రీజ – కళ్యాణ్ దేవ్.
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె ‘శ్రీజ’ తన భర్త కళ్యాణ్ దేవ్ తో ప్రస్తుతం దూరంగా ఉంటుంది. కళ్యాణ్ దేవ్ – శ్రీజ మధ్య అస్సలు పొసగడం లేదట. ఈ నేపథ్యంలోనే శ్రీజ, తన పేరు నుంచి కళ్యాణ్ దేవ్ పేరును తీసేసింది. అయితే, అధికారిక విడాకులు మాత్రం ఈ జంట ఇంకా తీసుకోలేదు. పోనీ తమ పై వస్తున్న పుకార్ల విషయంలోనూ ఈ జంట నోరెత్తడం లేదు. తమ గురించి ఎవరికీ ఏమి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. మరి ఎన్నాళ్ళు ఈ దాపరికమో చూడాలి.
కృష్ణవంశీ – రమ్యకృష్ణ :
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ తరం క్రియేటివ్ డైరెక్టర్స్ లో ముందు వరుసలో నిలిచే పేరు ‘కృష్ణ వంశీ’. హీరోయిన్ రమ్యకృష్ణతో చాలా సంవత్సరాలు ప్రేమ వ్యవహారం నడిపి ఫైనల్ గా రమ్యకృష్ణనే వివాహం చేసుకున్నాడు. అయితే గత కొంత కాలంగా రమ్యకృష్ణ అండ్ కృష్ణ వంశీ బంధం అంత గట్టిగా లేదని రూమర్స్ వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కృష్ణవంశీ హైదరాబాద్ లో ఉంటుండగా రమ్యకృష్ణ మాత్రం చెన్నైలో ఉంటుంది. ఈ జంట కూడా అధికారిక విడాకులు తీసుకోలేదు. కానీ, వృత్తిపరంగా అప్పుడప్పుడు కలుస్తున్నారు. కానీ కలిసి మాత్రం ఉండటం లేదు.
Also Read: Pakka Commercial Collections: “పక్కా కమర్షియల్” 10 డేస్ కలెక్షన్స్.. ఏమిటి బాక్సాఫీస్ పరిస్థితి ?
విజయశాంతి – శ్రీనివాస్ ప్రసాద్
తెలుగు చిత్రసీమలో విజయశాంతికి లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ ఉంది. కర్తవ్యంలో ఫైట్లు చేసినా.. గ్లామర్‌కి గ్రామర్ నేర్పిన హీరోయిన్ గా చెలరేగిపోయినా ఆమెకే సొంతం. అయితే.. విజయశాంతి పర్సనల్ లైఫ్ పై ఇప్పటికీ ఎన్నో పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. విజయశాంతి శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఎన్టీఆర్ పెద్దల్లడు గణేష్ రావుకు ఈ శ్రీనివాస్ ప్రసాద్ స్వయాన మేనల్లుడు. అందుకే.. హీరో బాలకృష్ణతో శ్రీనివాస్ ప్రసాద్ కి మంచి ఫ్రెండ్‌షిప్ ఉండేది. ఈ క్రమంలోనే బాలయ్యతోె ‘నిప్పురవ్వ’ అనే సినిమా తీశాడు. ఈ సినిమా సమయంలోనే విజయశాంతితో పరిచయం ప్రేమగా మారడం.. పెళ్లి వరకు వెళ్ళింది. కానీ.. ఆ తర్వాత ఈ జంట ఎప్పుడు కలిసి కనిపించలేదు. విజయశాంతి వ్యక్తిగత కార్యక్రమాల్లో కూడా శ్రీనివాస్ ప్రసాద్ ఎక్కడా కనిపించలేదు. అయితే, అధికారిక విడాకులు మాత్రం ఈ జంట తీసుకోలేదు. అసలు తమ గురించి ఎవరికీ ఏమి తెలియకుండా ఇప్పటికీ జాగ్రత్త పడుతున్నారు.
Also Read:Uday Kiran: అప్పటి ముచ్చట్లు : చనిపోయే ముందు ‘ఉదయ్ కిరణ్’ ఆమెనే ఎందుకు కలిశాడు ?