
Taraka Ratna : గొప్ప బ్యాక్ గ్రౌండ్ మరియు టాలెంట్ ఉన్నప్పటికీ ఇసుమంతైనా అదృష్టం లేకపోతే ఇండస్ట్రీ లో సక్సెస్ కాలేరు అనడానికి సరైన ఉదాహరణ నందమూరి తారకరత్న అనే చెప్పొచ్చు.మొదటి సినిమా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ ప్రారంభం రోజే 8 సినిమాలకు సంతకం చేసిన ఏకైక ఘనత తారకరత్న సొంతం.మొదటి సినిమా కమర్షియల్ గాను మరియు ఆడియో పరంగాను పెద్ద సక్సెస్ అయ్యినప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
దీనితో ఈ హీరో స్టార్ కాలేకపోయాడు కానీ మంచి నటుడిగా మాత్రం పేరు తెచ్చుకున్నాడు.సెకండ్ ఇన్నింగ్స్ లో ‘అమరావతి’ అనే చిత్రంలో విలన్ గా నటించి ఉత్తమ విలన్ గా నంది అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు.ఇప్పటికీ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేసుకుంటూ మరోపక్క యాక్టీవ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన తారకరత్న నిన్న సాయంత్రం హఠాన్మరణం పాలవ్వడం యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రం లోకి నెట్టేసింది.
ఇది ఇలా ఉండగా తారకరత్న కి ఏ రేంజ్ లో దురదృష్టం ఉందో ఇప్పుడు కొన్ని ఉదాహరణలు మనం చూడబోతున్నాము.కెరీర్ ప్రారంభం లో ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడు.మొదటి సినిమా చేస్తున్న సమయం లో 8 సినిమాలకు కమిట్ అవ్వడం వల్లే ఈ సూపర్ హిట్ సినిమాలు మిస్ అయ్యాయి.వాటిల్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన ‘అతనొక్కడే’ సినిమా కూడా ఉంది.
ఈ చిత్రాన్ని తొలుత తారకరత్న తోనే తీద్దాం అనుకున్నారట, కానీ కుదర్లేదు.అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ద్వారానే తారకరత్న పరిచయం కావాల్సింది అట.కానీ చాలా మంది హీరోలు ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్టు గానే తారక రత్న కూడా రిజెక్ట్ చేసాడట.అలా ఈ రెండు సూపర్ హిట్ సినిమాలను మిస్ అయ్యాడు తారకరత్న.ఒకవేళ ఈ రెండు సినిమాలు చేసి ఉంటే తారకరత్న కెరీర్ మరో లెవెల్ లో ఉండేదేమో.