https://oktelugu.com/

Heroines : ఇండియా లో రోజుకి కోటి రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్లు వీళ్ళు..మన టాలీవుడ్ నుండి ముగ్గురు!

ప్రస్తుతం వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మన ఇండియన్ సినిమాలు ఏ రేంజ్ సునామీ ని సృష్టిస్తున్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాం.

Written By:
  • Vicky
  • , Updated On : December 28, 2024 / 01:24 PM IST

    Tollywood

    Follow us on

    Heroines : ప్రస్తుతం వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మన ఇండియన్ సినిమాలు ఏ రేంజ్ సునామీ ని సృష్టిస్తున్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాం. వాటిల్లో ఎక్కువగా మన తెలుగు సినిమాలే ఉన్నాయి. ఓటీటీ కారణంగా అంతర్జాతీయ లెవెల్ లో మన సినీ తారలు గుర్తింపు ని కూడా పొందుతున్నారు. ఒకప్పుడు థియేట్రికల్ రైట్స్, సాటిలైట్ రైట్స్ మాత్రమే ఉండేవి, ఇప్పుడు డిజిటల్ రైట్స్ కూడా తోడైంది. వీటి ద్వారా నిర్మాతలకు విడుదలకు ముందే భారీ స్థాయిలో టేబుల్ ప్రాఫిట్స్ వస్తున్నాయి. అందుకే మేకర్స్ ని నటీనటులు రెమ్యూనరేషన్ విషయం లో అసలు తగ్గడం లేదు. హీరోల వంద కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కి వెళ్తే, ఒకప్పుడు సినిమాకి లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లు ఇప్పుడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ ని అందుకుంటున్నారు. అలా రోజుకి కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసే హీరోయిన్స్ ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం.

    ప్రియాంక చోప్రా:

    బాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈమె ఇప్పుడు హాలీవుడ్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. అక్కడ విలన్ గా, హీరోయిన్ గా పలు సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. హాలీవుడ్ లో ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు 10 మిలియన్ డాలర్లు అందుకుంటున్నట్టు సమాచారం. 10 మిలియన్ డాలర్లు అంటే 80 కోట్ల రూపాయలకు పైగానే అన్నమాట. ప్రస్తుతం ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈ చిత్రం లో నటించడం కోసం ఆమె రోజుకి రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.

    దీపికా పదుకొనే:

    బాలీవుడ్ లో ఈమెకి స్టార్ హీరోలతో సరిసమానమైన క్రేజ్ ఉంది. ఒక పక్క హీరోయిన్ గా చేస్తూనే, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ఈమె కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. బాలీవుడ్ లో ఒక్కో సినిమాకి 30 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్న ఈమె, కల్కి చిత్రం లో 24 రోజులు పని చేసినందుకు గానూ, 24 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది. అంటే రోజుకు కోటి రూపాయిల రెమ్యూనరేషన్ అన్నమాట.

    శ్రద్దా కపూర్ :

    బాలీవుడ్ లో ఈమెకి యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. రీసెంట్ గానే ఈమె స్త్రీ 2 చిత్రం తో బాలీవుడ్ లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకుంది. ఈమె ఇప్పుడు ఒక్కో సినిమాకి 30 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా, సినిమా బడ్జెట్ ని బట్టి ఈమె రోజుకి 1.5 కోట్ల నుండి 2 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ ని తీసుకుంటుందట.

    అలియా భట్ :

    ఈమెకు కూడా బాలీవుడ్ స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకి 24 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ని అందుకుంటుండగా, #RRR చిత్రం లో 10 రోజులు పని చేసినందుకు 9 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ని తీసుకుంది.

    నయనతార :

    ఈమె ప్రస్తుతం ఒక్కో సినిమాకి 12 నుండి 15 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ని అందుకుంటుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తున్న ఈమె, షారుఖ్ ఖాన్ తో నటించిన జవాన్ సినిమా కోసం 22 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుందట. అంతే కాదు తక్కువ పని దినాలు ఉన్న సినిమాలకు ఈమె రోజుకి కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ని ఛార్జ్ చేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    అనుష్క :

    ఈమె చేసే సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. రెండేళ్లకు ఒక సినిమా చేసినా కూడా రెమ్యూనరేషన్ విషయం లో అసలు తగ్గే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి ఈమె ఒక్కో సినిమాకు పది కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని అందుకుంటుంది. త్వరలో ఈమె ప్రధాన పాత్ర పోషించిన ‘ఘాటీ’ అనే చిత్రం విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అనుష్క 12 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని అందుకుంటుందట. తక్కువ డేట్స్ ఉన్న సినిమాలకు ఈమె కూడా రోజుకి కోటి రూపాయిలు డిమాండ్ చేస్తుందని సమాచారం.

    సమంత :

    ఇండస్ట్రీ లోకి వచ్చిన రెండు మూడేళ్లకే స్టార్ హీరోయిన్ గా మారిన ఈమె, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో ఏ రేంజ్ కి వెళ్లిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. సమంత అంటే పేరు కాదు, బ్రాండ్ అనే స్థాయిలో ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈమె కూడా పది కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని అందుకునే హీరోయిన్స్ లో ఒకరు. ఈమె కూడా సినిమా బడ్జెట్ ని బట్టి రోజుకి కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తుందట.

    రష్మిక మందన :

    కన్నడ సినీ పరిశ్రమ నుండి తెలుగులో ‘ఛలో’ చిత్రం ద్వారా అడుగుపెట్టిన ఈమె, అతి తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్ కి బాగా నచ్చే సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక పుష్ప సిరీస్, ఎనిమల్ చిత్రాలతో ఈమె పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమె కూడా ప్రస్తుతం ఒక్కో సినిమాకి 10 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిందట.

    రేస్ లోకి దూసుకొస్తున్న శ్రీలీల, సాయి పల్లవి :

    ఈ ఇద్దరు హీరోలకు యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ముఖ్యంగా డ్యాన్స్ విషయంలో వీళ్లిద్దరు చెలరేగి పోతుంటారు. శ్రీలీల ‘పుష్ప 2 ‘ చిత్రం ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐటెం సాంగ్ ని నాలుగు రోజులు చిత్రీకరించారట. నాలుగు రోజులకు ఆమె నాలుగు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నట్టు సమాచారం. అదే విధంగా సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో ‘రామాయణం’ చిత్రం లో సీత గా నటిస్తుంది. ఈ చిత్రం కోసం ఆమె 12 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసినట్టు సమాచారం.