Bigg Boss telugu 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇటీవల ప్రారంభమైంది. ఈ షోకి వెళ్లాలని చాలా మంది ఎన్నో కలలు కంటారు. కేవలం సెలెబ్రిటీలు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా ఈ షోకి వెళ్లవచ్చు. కాకపోతే వెళ్లడం చాలా కష్టం. అయితే ఈ షోకి ఎంతో ఇష్టపడి వెళ్తారు. కానీ షో లోపల ఉండటం చాలా కష్టం. శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్ అయితేనే ఉండగలరు. అనారోగ్య సమస్యలు ఉంటే ఎలిమినేట్ కాకుండానే బయటకు వస్తారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు.. స్టార్ మా కొన్ని కండిషన్స్ పెడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఏ తెలివిజన్ అయిన కూడా కండిషన్స్ తప్పకుండా ఉంటాయి. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లిన వాళ్లు ఇతర షోలకి అసలు వెళ్లకూడదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఇప్పుడు ఇంకా కష్టమైన కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇంతకీ కంటెస్టెంట్స్ కి పెట్టిన ఆ కఠినమైన కండిషన్స్ ఏంటో మరి తెలుసుకుందాం.
బిగ్ బాస్ షోకి వెళ్లిన వాళ్లు ఒక ఏడాది పాటు ఇతర షో లో పాల్గొనకూడదు. కేవలం స్టార్ మా వాళ్లకి సంబంధించిన షోలో మాత్రమే కనిపించాలి. వీళ్లకి రేమ్యూనరేషన్ కూడా ఒక్కసారిగా ఇవ్వరు. హౌస్లోకి వెళ్లే ముందు.. కేవలం ఒక వారం రేమ్యూనరేషన్ ఇస్తారు. ఆ తరువాత హౌస్ నుంచి బయటకు వచ్చిన నెల రోజులకి 80 శాతం రేమ్యూనరేషన్ ఇస్తారు. మరి మిగతా రేమ్యూనరేషన్ అంతా 9 నెలలు పూర్తి అయిన తరువాత ఇస్తారు. ఇలా వాళ్ల రేమ్యూనరేషన్ పెండింగ్ లో ఉంచడం వల్ల అగ్రిమెంట్ రూల్ పాటిస్తారని ఇలా ఉంచుతారు. అలాగే షో లోపలికి వెళ్లే ముందు.. షోకి వెళ్తున్నట్లు, ఎలా సెలెక్ట్ అయ్యారని, పూర్తి వివరాలు బయట ఎవరితో కూడా చెప్పకూడదు. వీటితో పాటు మరో కొత్త కండిషన్ స్టార్ మా పెట్టింది. ఎలిమినేషన్ అయినా తరువాత కంటెస్టెంట్స్ ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. ఎలిమినేట్ అయినా మొదటి వారం నుంచి బిగ్ బాస్ ఫినాలే వరకు కూడా ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. ఫినాలే జరిగిన ఒక వారం తరువాత మాత్రమే కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూ ఇవ్వాలని నిబంధన కొత్తగా తీసుకొచ్చారు. బిగ్ బాస్ కి వెళ్లిన వాళ్లు మాత్రం కొన్ని రోజుల వరకు ఎలాంటి షో లోకి వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా వేరే ఛానల్ లో ఇంటర్వ్యూలు, షోలు, సీరియల్ లు చేయకూడదు. అయితే ఈసారి హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూ లు ఇవ్వకూడదని కొత్త రూల్ నిజమో కాదో మరి తెలియాలంటే ఈ వారం ఎలిమినేషన్ వరకు వేచి చూడాల్సిందే.
Bhaskar Katiki is the main admin of the website
Read More