https://oktelugu.com/

Mahesh Babu – Namratha : మహేష్ బాబు నమ్రత కాంబినేషన్ లో మిస్ అయిన సినిమాలు ఇవే…

ఈ రెండు సినిమాలు కనక వీళ్ళ కాంబినేషన్ లో పడితే ఆమె టాప్ హీరోయిన్ అయ్యేది. అలాగే వీళ్ళ కాంబినేషన్ కు కూడా ఒక మంచి గుర్తింపు అయితే వచ్చేది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు నమ్రత తో కలిసి హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 8, 2024 / 11:09 PM IST
    Follow us on

    Mahesh Babu – Namratha : ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అమల, నాగార్జున ఇద్దరు కూడా శివ సినిమాలో కలిసి నటించారు. ఆ సమయం లో వీళ్లిద్దరు ప్రేమించుకున్నారు. ఇక ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఆ తర్వాత వీళ్ల బాటలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత లు కూడా నడిచారనే చెప్పాలి.

    ఇక వీళ్లిద్దరు కలిసి వంశీ సినిమాలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. దానివల్ల ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఏర్పడింది. దాంతో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు నమ్రత ఇద్దరు ప్రేమించుకుంటున్న సందర్భంలో వీళ్ళ కాంబినేషన్ లో కొన్ని సినిమాలు రావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమాల్లో నమ్రత హీరోయిన్ గా నటించలేదు. అందులో ముఖ్యంగా గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘ఒక్కడు ‘ సినిమాలో నమ్రత హీరోయిన్ గా నటించాలి.

    కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తన ఇమేజ్ ఆ సినిమాకి సెట్ అవ్వదనే ఉద్దేశ్యంతో తనని సినిమా నుంచి పక్కకు తప్పించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన అతడు సినిమాలో కూడా నమ్రత నటించాల్సింది. కానీ ఆ పాత్రకి తను సెట్ అవ్వదని త్రివిక్రమ్ మహేష్ బాబుతో చెప్పడం వల్ల తనని మళ్లీ ఆ సినిమా నుంచి తప్పించారు. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత మహేష్ బాబు నమ్రత ను పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటివరకు నమ్రత ఏ సినిమాలో నటించలేదు. ఇక మీదట కూడా ఆమెకి నటించే ఉద్దేశ్యం లేనట్టుగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన వంశీ సినిమా ప్లాప్ అయ్యింది.

    ఈ రెండు సినిమాలు కనక వీళ్ళ కాంబినేషన్ లో పడితే ఆమె టాప్ హీరోయిన్ అయ్యేది. అలాగే వీళ్ళ కాంబినేషన్ కు కూడా ఒక మంచి గుర్తింపు అయితే వచ్చేది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు నమ్రత తో కలిసి హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు.