Tollywood Gossip : ఒక సినిమా సక్సెస్ అవడానికి ఆ సినిమా హీరో గాని, డైరెక్టర్ గాని చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ముందుకు కదులుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొన్ని సినిమాలు భారీ సక్సెస్ లను సాధిస్తు ఉంటే మరికొన్ని సినిమాలు మాత్రం ప్లాప్ లుగా మిగిలిపోతాయి. ఇక ఇది ఇలా ఉంటే మన స్టార్ హీరోలు నటించిన కొన్ని సినిమాల్లో ఫస్ట్ ఆఫ్ మొత్తం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్న సినిమాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అడవి దొంగ సినిమాలో చిరంజీవి ఫస్ట్ హాఫ్ మొత్తం కాకుండా సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే ఆయన సినిమాలో మూగవాడి క్యారెక్టర్ ని పోషించాడు కాబట్టి తను అలా ఉండిపోతాడు. ఇక సెకండ్ హాఫ్ లో తనకు మాటలు వస్తాయి. దాంతో ఆయన మాటలు బాగా మాట్లాడుతూ విలన్ల ని తుప్పుర్రేగ్గోడుతూ ఉంటాడు. ఇక ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించింది…
ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన నరసింహుడు సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక్క మాట కూడా మాట్లాడకుండా కామ్ గా ఉండిపోతాడు. అతను అలా ఉండడానికి కారణం ఏంటి అనేది సెకండాఫ్ లో రివిల్ చేసినప్పటికీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బోరింగ్ గా సాగుతూ ఉంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు సూపర్ సక్సెస్ అవుతుందనుకున్న కూడా అది మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది.
ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఫస్ట్ హాఫ్ లో హీరోలు ఒక్క డైలాగ్ కూడా మాట్లాడకుండా సినిమా మొత్తం లాగించేసుకుంటూ వచ్చారు. ఇక మొత్తానికైతే ఈ రెండు సినిమాల్లో మన స్టార్ హీరోలు సగం సినిమా వరకు మాట్లాడకుండా ఉండడం విశేషం…