Homeఎంటర్టైన్మెంట్NEGATIVE TALK: నెగెటివ్ టాక్ తెచ్చుకుని మరీ భారీ కలెక్షన్లు సాధించిన సినిమాలు ఇవే..!

NEGATIVE TALK: నెగెటివ్ టాక్ తెచ్చుకుని మరీ భారీ కలెక్షన్లు సాధించిన సినిమాలు ఇవే..!

NEGATIVE TALK: చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి అద్భుతాలు జరుగుతుంటాయి. కథ బాలేకున్నా కొన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయి. అప్పుడు దాని క్రెడిట్ దర్శకుడికి వెళ్తుంది. ఎందుకంటే అలా మేకింగ్ చేసే టాలెంట్ అతనికే సొంతం. ఇండస్ట్రీలో ఇలా తమ మేకింగ్‌తోనే హిట్ కొట్టిన దర్శకులు చాలానే ఉన్నారు.

అలాంటి వారిలో త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి లాంటి దిగ్గజ దర్శకులు వస్తారు. వీరు తెరకెక్కించిన సినిమాల్లో కథనం పెద్దగా లేకపోయినా మేకింగ్, డైలాగ్ డెలవరీ, స్క్రీన్ ప్లే ద్వారానే సినిమాలకు కొత్త రంగులు అద్దారు. దీంతో సినిమాలు విడుదయ్యాక నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లు సాధించి కమర్షియల్ హిట్ అందుకున్నాయి. ఈ జాబితాలోకి ఎవరెవరు వస్తారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

NEGATIVE TALK
NEGATIVE TALK

గతేడాది డిసెంబర్‌లో విడుదలైన పుష్ప ది రైజ్ సినిమా కొన్ని సెంటర్లలో నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ వసూళ్ల పరంగా చూసుకుంటే రూ.250 కోట్ల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కావడంతో బన్నీ సేఫ్ అయ్యాడు అనుకోవచ్చు. ఏపీలో టికెట్ ధరలు తగ్గించడం వలన అక్కడ కలెక్షన్లు పెద్దగా లేకపోయినా తెలంగాణలో మాత్రం రూ.36 కోట్లు వసూలయ్యాయి. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన

‘పెళ్లి సందD’మూవీ తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చినా 2.50 కోట్ల లాభాలు తీసుకొచ్చింది.

pelli sandaD Movie
pelli sandaD Movie

Also Read: దిల్ రాజు అంటేనే అసలు వాడకానికి ప్రతి రూపం !

రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’మూవీని పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేయగా తొలిరోజు నెగిటివ్ టాక్‌ వచ్చింది. కానీ, మాస్ సెంటర్స్‌లో ఈ సినిమా కుమ్మేసింది. ఏకంగా 18 కోట్ల లాభాలు వచ్చాయి. అదే విధంగా మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’మూవీ మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చినా రూ.100 కోట్ల షేర్ వసూలు చేసింది. బన్నీ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన

  • ‘సరైనోడు’మూవీ ఓవర్సీస్‌లో డిజాస్టర్ అవ్వగా, ఇండియాలో మాత్రం అదరగొట్టింది.
  • ఏకంగా 70 కోట్ల షేర్ రాబట్టింది. ఈ జాబితాలోకి
  • బన్నీ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి,
  • ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో,
  • వెంకటేశ్ మాస్ రోల్ చేసిన తులసి,
  • రాంచరణ్ రచ్చ మూవీ,
  • గోపిచంద్ హీరోగా చేసిన శౌర్యం,
  • నాగ్ నటించిన సోగ్గాడే చిన్నినాయనా,
  • నాని హీరోగా చేసిన ఎంసీఏ,

రవితేజ హీరోగా చేసిన పవర్ మూవీ లు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ కథ పరంగా చూసుకుంటే యావరేజ్ అయినా, దర్శకులు తమ మేకోవర్‌తో కమర్షియల్ హిట్ ట్రాక్ ఎక్కించారు.

Also Read: ఒమిక్రాన్‌పై బూస్టర్ డోస్ ప్రభావం చూపుతోందా.. నిపుణులు ఏమంటున్నారు..?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular