New Movies Releases This Week: ఈ ఏడాది మొదటి భాగం మొత్తం పెద్ద హీరోల సినిమాలు వరుసగా సందడి చెయ్యగా..రెండవ భాగం మొత్తం ఎక్కువగా చిన్న సినిమాలు మరియు మీడియం రేంజ్ హీరోల సినిమాలు మాత్రమే విడుదలైన..సర్కారు వారి పాట సినిమా తర్వాత విడుదలైన స్టార్ హీరో సినిమా ఏదైనా ఉందా అంటే అది గాడ్ ఫాదర్ అనే చెప్పాలి..గత వారం ఏకంగా 9 చిన్న సినిమాలు విడుదల అవ్వగా..ఈ వారం కేవలం మూడు సినిమాలు మాత్రమే థియేటర్స్ లో సందడి చెయ్యబోతున్నాయి..ఆ సినిమాలేంటో..వాటి ప్రత్యేకతలు ఏమిటో ఒకసారి చూద్దాము.
యశోదా:

చాలా కాలం తర్వాత సమంత చేసిన డైరెక్ట్ తెలుగు చిత్రం యశోద..సుమారు 40 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రానికి హరి మరియు హరీష్ దర్శకత్వం వహించగా వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ గా నటించింది..మలయాళం హీరో ఉన్ని ముకుందన్ ఇందులో ఒక ముఖ్య పాత్ర పోషించాడు..సరోగసి మీద తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఈ విశేషంగా ఆకట్టుకొని అంచనాలను పెంచేలా చేసింది..ఇక చాలా కాలం నుండీ మియోసిటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ప్రస్తుతం చికిత్స తీసుకుంటుంది..కానీ సినిమా విడుదల దగ్గర పడుతుండడం తో ఆమె హాస్పిటల్ బెడ్ మీద నుండే డబ్బింగ్ పూర్తి చేసింది..ఇప్పుడు ప్రొమోషన్స్ లో భాగంగా ఇంటర్వూస్ ఇస్తుంది..సమంత ఎంతగానో నమ్మి చేసిన ఈ సబ్జెక్టు ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.
నచ్చింది గాళ్ ఫ్రెండు:
‘ఆటగాడరా శివా’ మరియు ‘మిస్ మ్యాచ్’ వంటి విబిబిన్నమైన కథలలో హీరో గా నటించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించిన ఉదయ్ శంకర్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’..గురు పవన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 11 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది..ఒక రోజు లో జరిగిన కథ తో సస్పెన్స్ మరియు థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో ఈ సినిమాని ఆసక్తికరంగా మలిచాడట డైరెక్టర్..చూడాలిమరి ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో అనేది.

మది:
ఇక ఈ వారం విడుదల అవుతున్న మరో చిన్న సినిమా ‘మది’ ..నాగ ధనుష్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం లో శ్రీ రామ్ నిమ్మల మరియు రిచా జోషి హీరోహీరోయిన్లుగా నటించారు..రొమాంటిక్ లవ్ స్టోరీ గా యూత్ ని అలరించే కథాంశం తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత వరుకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఊంచాయి:

అమితాబ్ బచ్చన్ , అనుపమ్ ఖేర్ మరియు బోమన్ ఇరాన్ ప్రధాన పాత్రలలో ప్రముఖ దర్శకుడు సూరజ్ తెరకెక్కించిన చిత్రం ‘ఊంచాయి’..ఎప్పుడు ప్రేమ కథ మరియు కుటుంబ కథా చిత్రాలు తీసే సూరజ్..తొలిసారి తన పంధాని మార్చుకొని ఒక విబిబిన్నమైన కథాంశం తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు..ఇందులో ప్రియాంక చోప్రా సోదరి పరిణీతి చోప్రా,నీనా గుప్త మరియు శారికా వంటి హీరోయిన్స్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు..ఈ చిత్రం కూడా ఈనెల 11 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.