https://oktelugu.com/

Celebrities Illegal Affair: ఇల్లీగల్ ఎఫైర్స్ వల్ల జీవితాలు నాశనం చేసుకున్న సినీ సెలబ్రిటీలు వీళ్లే…

నిజానికి ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుంటున్నారు అంటే వీళ్లైన సక్రమంగా కలిసి ఉంటారా అనే లేదంటే అందరిలాగే విడిపోతారా అనే రీతిలో సినిమా ఇండస్ట్రీ పైన...

Written By:
  • Gopi
  • , Updated On : May 18, 2024 / 03:22 PM IST

    celebrities illegal affair

    Follow us on

    Celebrities Illegal Affair: సినిమా ఇండస్ట్రీ అంటే ఇప్పుడు చాలా దారుణంగా తయారైంది. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద కొన్ని అపోహలైతే ఉండేవి కానీ ఇప్పుడు ఆ అపోహాలు నిజమవుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న చాలామంది హీరో హీరోయిన్లు, పెళ్లిళ్లు చేసుకొని కొన్ని ఇల్లీగల్ ఎఫైర్స్ వల్ల విడాకులు తీసుకొవాల్సి వస్తుంది. దానివల్లే ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతున్నారు. ఇక ఈ మాత్రం దానికి పెళ్లి చేసుకోవడం దేనికి అని చాలామంది విమర్శకులు సైతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటినటులపైన విమర్శలను గుప్పిస్తున్నారు.

    నిజానికి ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుంటున్నారు అంటే వీళ్లైన సక్రమంగా కలిసి ఉంటారా అనే లేదంటే అందరిలాగే విడిపోతారా అనే రీతిలో సినిమా ఇండస్ట్రీ పైన బయట ఉన్న వ్యక్తులు విమర్శలు చేసేంత స్థాయికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వివాహ వ్యవస్థ అనేది దిగజారి పోయిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తెలుగులో ఉన్న ఒక స్టార్ డైరెక్టర్ ఒక హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఇక తను హీరోయిన్ తో ప్రైవేట్ ప్లేస్ లో ఉన్నప్పుడు తన భార్య వాళ్ళను చూడటం తో అతను రెడ్ హ్యాండెడ్ గా ఆమె కి దొరికిపోయాడు. దాంతో అతని భార్య ఆయనకి విడాకులు ఇచ్చింది.

    ఇక అలాగే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక టాప్ హీరో తను పెట్టుకున్న ఇల్లీగల్ ఎఫైర్స్ వల్ల తన భార్య నుంచి విడిపోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న మరి కొంతమంది నటీనటులు కూడా ఇలాంటి వ్యవహారాల వల్ల విడిపోయి ఎవరికి వాళ్లే బతికేస్తున్నారు… ఇప్పుడు మరి కొంతమంది విడిపోవడానికి కూడా రెడీగా ఉన్నారు. మరి సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ మధ్య ఉన్న ఈ విడాకులు అనేవి ఆగిపోవాలంటే ఇండస్ట్రీలో ఉన్న నటినటులందరూ వాళ్ళ బిహేవియర్ ని మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటీనటులు కలిసి నటిస్తారు. కాబట్టి ఒకరి పట్ల ఒకరికి ఇష్టం అనేది పెరిగడం కామన్ గా జరుగుతుంది.

    ఇక హీరో గాని, హీరోయిన్ గాని అట్రాక్ట్ అవుతూ ఉండడం వల్ల ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ అయితే ఏర్పడుతుంది. అయితే ప్రొఫెషన్ లో భాగంగా మేము కలిసి నటిస్తున్నాం అని ఆ రిలేషన్ ను జస్ట్ ఫ్రెండ్షిప్ గా భావించి పర్సనల్ లైఫ్ లోకి తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. అలా కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా వారిని ఇన్వాల్వ్ చేయాలి అనుకునే పరిస్థితి వస్తే మాత్రం పచ్చగా ఉన్న కాపురాలన్ని కూలిపోక తప్పదు…ఇక ఇప్పటికైన సినిమా ఇండస్ట్రీ లో ఉన్న నటీనటుల మెంటాలిటీ మారితే సగం కాపురులైన కూలిపోకుండా ఉంటాయి…