Tesla Cars: రేంజ్ ను బట్టి కార్లను వాడుతుంటారు. చేతిలో డబ్బు ఎక్కువగా ఉంటే.. కార్లు, బంగ్లాలు అంటూ విలాసవంతమైన జీవితం గడపుతుంటారు. కార్లను కూడా వారి హోదాను బట్టి కొంటారు అని చెప్పడంలో సందేహం లేదు. మరికొందరు చేతిలో డబ్బులేకున్న కార్ల పై ఉన్న ఇష్టంతో ఈఎమ్ఐ ద్వారా నెల జీతం మొత్తం వాటికే ఖర్చు పెడుతుంటారు. అయితే బ్రాండెడ్ కార్లను కొనాలి అంటే లక్షల్లో సంపాదన ఉంటేనే సాధ్యమవుతుంది. బట్టల్లో బ్రాండ్, ఫోన్ బ్రాండ్, చెప్పులు బ్రాండ్ ఇలా ప్రతీది బ్రాండ్ వాడే వారుంటే.. కార్లలో కూడా బ్రాండ్ కొనాలనే ఆరాటం చాలా మందిలో ఉంటుంది. కానీ ఆచరణ మాత్రం కొందరికే సాధ్యం. ఎందుకంటే అది రేటుతో కూడుకున్న వ్యవహారం. మరి మన సెలబ్రెటీలలో అలాంటి వారు ఎవరున్నారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం…
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ కార్ టెస్లా. టెస్లా కార్లలో వాడిన టెక్నాలజీ మరే ఇతర కారులో వాడలేదంటే అతిశయోక్తి కాదు. ఈ కంపెనీ కార్లలో చేసే డ్రైవింగ్ ఎక్స్‌పిరియన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇవి ఇంకా అధికారికంగా ఇండియాలో అమ్మడు అవడం లేదు. కానీ దీనిపై ఇష్టంతో కొందరు సెలబ్రిటీలు అమెరికా, ఇతర దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకున్నారు. వారికి ఆ కార్ల మీద ఉన్న ఇష్టం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేలా చేస్తుంది. మన దగ్గర ఈ కార్లను వాడే వారి సంఖ్య అతి తక్కువ. బెంజ్, బీఎమ్ డబ్లూ వంటి కార్లు ఎక్కువ మంది దగ్గర కనిపిస్తాయి కానీ అసలు ఈ టెస్లా కంపెనీ కారు కనిపించడం కూడా విశేషమే అని చెప్పాలి.
జెనీలియా భర్త:
ప్రముఖ హీరోయిన్ జెనీలియా డిసౌజా కొద్ది రోజుల క్రితం తన భర్త ‘రితేష్ దేశ్‌ముఖ్‘ కోసం టెస్లా కంపెనీకి చెందిన ‘మోడల్ ఎక్స్’ కారును కొని గిఫ్టుగా అందించింది. బర్త్‌డే స్పెషల్ గా ఈ కారును అందించడంతో ఆమె భర్త ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి.రితేష్ టెస్లా మోడల్ ఎక్స్ కారు రెడ్ కలర్ లో అద్భుతంగా కనిపిస్తుంది. ఈమె సినిమాల్లో ఒకప్పుడు వెలుగు వెలిగి ఇప్పుడు అంతగా సినిమాల్లో కనిపించడం లేదనే చెప్పాలి. బొమ్మరిల్లు సినిమాతో ఫిదా చేసింది జెనీలియా. సత్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ఇప్పుడు తెరపై ఒక్క సినిమాల్లో కూడా కనిపించడం లేదు. కానీ కన్నడ, తెలుగు భాషల్లో వచ్చే ఒక సినిమాలో జెనీలియా కనిపించనుంది అని తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీ లీల లీడ్ రోల్ లో నటిస్తే.. ఈ అమ్మడు ఒక సాప్ట్ వేర్ కంపెనీ సీఈవో గా కనిపించనుందట. ఈమె రోల్ కి మంచి ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది.
పూజా బ్రాతా:
తెలుగులో సిసింద్రీ, గ్రీకువీరుడు సినిమాలలో నటించి మెప్పించిన బాలీవుడ్ నటి పూజా బాత్రా. ఈమె కూడా టెస్లా మోడల్ 3 కారును కొనుగోలు చేసింది. టెస్లా కంపెనీ తీసుకొచ్చిన అత్యంత చౌకైన కారు ఇది. పూజా బాత్రా ముంబైలో వినియోగిస్తున్న ఈ టెస్లా మోడల్ 3 బ్లాక్ కలర్‌లో చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. బాలీవుడ్ టాప్ నటీ హాట్ హీరోయిన్ పూజా బాత్రా. బాలీవుడ్ సినీ పరిశ్రమలోని అగ్రనటీమణుల్లో పూజా బాత్రా పేరు చెప్పుకోదగ్గ పేరు. ఈమె అందం, అభినయం, సెక్స్ ఫిగర్ తో 45 ఏళ్ల వయసున్నా కూడా ఇప్పటికీ కుర్రకారుకు మతి పోగొడుతుంది.
ప్రశాంత్ రుయా:
ఎస్సార్ క్యాపిటల్ డైరెక్టర్ ప్రశాంత్ రుయా టెస్లా మోడల్ ఎక్స్ కారును 2017లోనే దిగుమతి చేసుకున్నారు. అతను దీనిని ముంబై రోడ్లపై తిప్పుతుంటారు.
ముఖేష్ అంబానీ:
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ టెస్లా మోడల్ ఎస్ బ్లూ కలర్ కారును కొనుగోలు చేశారు. దీని రేటు కూడా అధికంగానే ఉంటుంది అని తెలుస్తోంది. ఇలా వీరు మాత్రమే టెస్లా కార్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని మరీ మన భారత గడ్డపై తిప్పుతుంటారు.