https://oktelugu.com/

Tollywood Heroines: డైరెక్టర్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీరే..

స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో డైరెక్టర్ మణిరత్నంను ప్రేమించి పెళ్లి చేసుకుంది సుహాసిని. అయితే కొన్ని వదంతులు రావడంతో పెళ్లికి తొందరపెట్టారట పెద్దలు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 7, 2023 / 03:56 PM IST

    Tollywood Heroines

    Follow us on

    Tollywood Heroines: సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎవరితో ప్రేమలో పడుతారో చెప్పడం కష్టం. కొంతమంది హీరోహీరోయిన్లు వివాహం చేసుకుంటే.. మరికొంతమంది హీరోయిన్లు, డైరెక్టర్లను వివాహం చేసుకుంటారు. అలా సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్లను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న హీరోయిన్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం..

    రమ్యకృష్ణ-కృష్ణ వంశీ
    కృష్ణ వంశీ మొదటి సినిమా గులాబీ. ఈ సినిమాలో మేఘాలలో తేలిపోతున్నది పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో రికార్డు సృష్టించింది పాట. ఈ పాట మొత్తాన్ని అరకు ఘాట్ రోడ్డులో తీసారు. ఈ పాట చిత్రీకరణ చేసిన విధానంతో డైరెక్టర్ కృష్ణ వంశీ పేరు మారుమోగింది. అతని టాలెంట్ చూసి మరిన్ని అవకాశాలు దక్కాయి కూడా. ఈ క్రమంలో రమ్యకృష్ణ కూడా ఈ పాటకి ఫ్లాట్ అయిపోయిందట. ఈ పాట తీసిని దర్శకుడు ఎవరు అని రమ్య ఆరా తీసిందట. ఎంక్వైరీ చేయగా అది కృష్ణ వంశీ అని తెలిసిందట. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం సిఫార్స్ ద్వారా కలిసింది డైరెక్టర్ ని. అలా కలిసిని వీరిద్దరు ముందు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమికులు అయ్యారు. చివరగా భార్యభర్తలు అయ్యారు. కానీ పెళ్లి తర్వాత కూడా రమ్యకృష్ణ సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదు. చాలా కాలం టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఇప్పటికి రమ్యకృష్ణ సినిమాలు చేస్తుంది. బాహుబలి లో శివగామిగా అద్భుతంగా నటించింది. మరోవైపు కృష్ణవంశీ కూడా తన కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.

    నయనతార-విఘ్నేశ్ శివన్..
    వీరిద్దరి ప్రేమకు నాసూమ్ రౌడీథాన్ సినిమా వారధిగా నిలిచింది. ఈ సినిమాతోనే విఘ్నేష్ దర్శకుడిగా పరిచయమయ్యారు. డైరెక్టర్ గా మారాలనే కలలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విఘ్నేష్ శివన్ అసిస్టెంట్ డైరెక్టర్, యాక్టర్, లిరిసిస్ట్ గా ఎన్నో పనులు చేశారు. చివరకు నాసూమ్ రౌడీథాన్ చిత్రానికి దర్శకత్వంగా వహించి అందుకున్నారు. అయితే ఈ సినిమాలో కథానాయిక పాత్రకు నయనతారను తీసుకోవాలని అనుకోలేదు. మొదట త్రిషను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆమె ఈ సినిమాలో నటించడానికి అంగీకరించింది. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంలో అనూహ్యంగా షూటింగ్ మొదలయ్యే సమయంలో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత హన్సికతో పాటు మరికొందరు హీరోయిన్ పేర్లు పరిశీలించారు. కానీ వారెవరూ రెడీగా లేకపోవడంతో చివరకు నయనతారను ఫైనలేజ్ చేశారు. ఆ నిర్ణయాన్ని విఘ్నేష్ శివన్ జీవితాన్ని మలుపు తిప్పింది. ఒకవేళ త్రిష ఈ సినిమాలో నటిస్తే నయనతారాతో విఘ్నేష్ శివన్ కు పరిచయం ఏర్పకపోయుండేది. అదే జరిగితే వారి జీవితం మరోలా ఉండేదని అభిమానులు అంటున్నారు.

    రోజా-సెల్వమణి
    ప్రేమ తపస్సు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రోజా. అదే విధంగా చెంబురతి అనే సినిమా ద్వారా ఈమె కోలివుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. ఈ సినిమాకు డైరెక్టర్ సెల్వమణి దర్వకత్వం వహించారు. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయం ప్రేమకు దారితీసిందని చెప్పాలి. అయితే రోజా సినిమా కెరీర్ ప్రారంభిస్తున్నప్పుడు తన సోదరులు ఈ అమ్మడు కోసం వారి కెరియర్ ను పణంగా పెట్టారట. దీంతో రోజా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొని సోదరులు లైఫ్ సెటిల్ చేయాలి అనుకుందట. అలా సెల్వమణి తో ప్రేమలో ఉండి 11 సంవత్సరాలు అయినా కూడా సోదరుల కోసం పెళ్లి చేసుకోకుండా అలానే ఉందట రోజా. చివరగా 2002లో వీరి వివాహం జరిగింది.

    సుహాసిని-మణిరత్నం
    స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో డైరెక్టర్ మణిరత్నంను ప్రేమించి పెళ్లి చేసుకుంది సుహాసిని. అయితే కొన్ని వదంతులు రావడంతో పెళ్లికి తొందరపెట్టారట పెద్దలు. సుహాసిని కమల్ హాసన్ అన్న సినీనటుడు చారుహాసన్ కూతురు. ఇలా అప్పటికే మంచి పేరు ఉండడంతో వీరి పెళ్లికి పెద్ద కష్టం కాలేదనే చెప్పాలి.
    ఖుష్బూ-సుందర్
    మూరై మురెన్ అనే సినిమా షూటింగ్ సమయంలో ఖుష్బూకు, సుందర్ కు పరిచయం ఏర్పడింది. ఒకరోజు తనను గుర్తు తెలియని వ్యక్తులు ఎగతాళి చేస్తే సుందర్ వాళ్లను కొట్టారట. ఆ తర్వాత ఈమె సినిమా చూడడానికి థియేటర్ కు వెళ్లగా అభిమానులు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేసారట. దీంతో సుందర్ భద్రత కల్పించారు. ఇలా ఎన్నో సందర్భాలలో ఖుష్బూకు తోడుగా నిలవడంతో ఆమెకు మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇక సుందర్ ఆమెపై ఉన్న ప్రేమను తెలియజేయగానే ఖష్బూ కూడా ఒప్పేసుకుంది. దీంతో 2000వ సంవత్సరంలో వీరి పెళ్లి జరిగింది.

    దేవయాని-రాజకుమార్
    నటి దేవయాని డైరెక్టర్ రాజకుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దేవయాని తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.