Baahubali 2 Records: బాహుబలి 2 ఆల్ టైం రికార్డ్స్ ని బ్రేక్ చేసే అవకాశం ఉన్న సినిమాలు ఇవే…

ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమా ఈనెల 22వ తేదీన రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. ఇక ఈ సినిమాకి కేజిఎఫ్ సిరీస్ ని డైరెక్షన్ చేసిన ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడం విశేషం... ఈ సినిమాతో ప్రభాస్ బాహుబలి 2 రికార్డుని తనే బ్రేక్ చేయబోతున్నాడు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి.

Written By: Gopi, Updated On : December 6, 2023 4:22 pm

Baahubali 2 Records

Follow us on

Baahubali 2 Records: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో చిత్రాలను తీసి తెలుగులో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొంది,చాలా సంవత్సరాల పాటు ఆ స్టార్ డమ్ ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు అందులో రాజమౌళి మొదటి స్థానం లో ఉంటాడు. ఆయన చేసిన ప్రతి సినిమాని కూడా విజయతీరాలకు చేర్చగలిగే సత్తా ఉన్న ఒకే ఒక్క ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి… ఈయన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత వరుసగా సక్సెస్ లు కొడుతూ ఒక సినిమాను మించి మరో సినిమాతో సక్సెస్ కొడుతూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక బాహుబలి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్నాడు.ఇక రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి 2 సినిమా ఇండియాలో 2000 కోట్లు కలెక్షన్లని రాబట్టింది. అయితే ఇప్పటివరకు ఈ కలక్షన్ లని బ్రేక్ చేసే మరో ఇండియన్ సినిమా రాలేదు. దాంతో ఇప్పుడు ఈ రికార్డ్ ని బ్రేక్ చేయగలిగే సినిమా ఏది అనే దాని మీద చాలా ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి.ఇక ఇప్పటికే ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి కొన్ని సినిమాలు పోటీ పడుతున్నాయి అవి ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం…

సలార్
ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమా ఈనెల 22వ తేదీన రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. ఇక ఈ సినిమాకి కేజిఎఫ్ సిరీస్ ని డైరెక్షన్ చేసిన ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడం విశేషం… ఈ సినిమాతో ప్రభాస్ బాహుబలి 2 రికార్డుని తనే బ్రేక్ చేయబోతున్నాడు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. నిజానికి ఈ సినిమా సక్సెస్ అయితే భారీ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా లేదా అనే దాని పైన చర్చలు అయితే సాగుతున్నాయి…

డాంకి
షారుఖాన్ హీరోగా రాజకుమార్ హిరానీ డైరెక్షన్ లో వస్తున్న డాంకి సినిమా ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే బాహుబలి సినిమా రికార్డ్ ను బ్రేక్ చేస్తుంది అంటూ పలు రకాల కామెంట్లు అయితే చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే షారుక్ ఖాన్ కెరియర్ లో ఇంతకు ముందు వరకు చాలా ఫ్లాపులు వచ్చిన కూడా ఇప్పుడు పఠాన్, జవాన్ లాంటి సినిమాలతో మళ్ళీ తను హిట్ ట్రాక్ ఎక్కాడు కాబట్టి ప్రస్తుతం డాంకీ సినిమా మీద చాలా అంచనాలైతే ఉన్నాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులందరిని విపరీతం గా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాతో బాహుబలి 2 సినిమా రికార్డును బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు చూడాలి మరి వాళ్ల నమ్మకం నిజం అవుతుందా లేదా అనేది…

పుష్ప 2
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమా 1200 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఇండియాలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో పుష్ప టాప్ 5 లో నిలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాతో 2000 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి బాహుబలి సినిమా రికార్డ్ ని బ్రేక్ చేయడానికి సుకుమార్ అల్లుఅర్జున్ ఇద్దరు ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఇక ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో ఈ మూడు సినిమాలకి బాహుబలి రికార్డును బ్రేక్ చేసే అవకాశం అయితే ఉంది. మరి వీటిలో ఏ సినిమా సక్సెస్ సాధించి బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందనేది వేచి చూడాలి…